క్రీడాభూమి

విజృంభించిన పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, సెప్టెంబర్ 12: చాలా కాలం తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ మంగళవారం ఇక్కడ ఏడు దేశాల ఆటగాళ్లతో కూడిన వరల్డ్ ఎలెవెన్ జట్టుతో జరిగిన మొదటి ట్వంటీ-20 మ్యాచ్‌లో విజృంభించి ఆడింది. 20 పరుగుల తేడాతో ప్రత్యర్థులను మట్టికరిపించి సత్తా చాటుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 8 పరుగులకే ఓపెనర్ ఫఖర్ జమన్ వికెట్‌ను చేజార్చుకున్నప్పటికీ అతని స్థానంలో వచ్చిన బాబర్ ఆజమ్ క్రీజ్‌లో నిలదొక్కుకుని బ్యాట్‌ను ఝళిపించాడు. నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (39)తో కలసి రెండో వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన బాబర్ ఆజమ్ మొత్తం మీద 52 బంతుల్లో 86 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించి నిష్క్రమించాడు. ఆ తర్వాత కెప్టెన్ సర్‌ఫ్రాజ్ అహ్మద్ (4) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినప్పటికీ సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ (20 బంతుల్లో 38 పరుగులు), ఇమద్ వాసిమ్ (4 బంతుల్లో 15-నాటౌట్) కూడా చక్కగా రాణించడంతో పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది. వరల్డ్ ఎలెవెన్ బౌలర్లలో థిసార పెరీరా 2 వికెట్లు కైవసం చేసుకోగా, మోర్న్ మోర్కెల్, కటింగ్, ఇమ్రాన్ తాహిర్ ఒక్కో వికెట్‌తో సరిపుచ్చుకున్నారు. అనంతరం 198 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన వరల్డ్ ఎలెవెన్ జట్టును పాక్ బౌలర్లు సమర్ధవంతంగా నిలువరించారు. ప్రత్యేకించి సొహైల్ ఖాన్ (2/28), షాదబ్ ఖాన్ (2/33), రమ్మన్ రరుూస్ (2/37) ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. వీరి జోరును ప్రతిఘటించడంలో విఫలమైన వరల్డ్ ఎలెవెన్ జట్టు పరుగుల వేటలో వెనుకబడింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే రాబట్టింది. దీంతో పాకిస్తాన్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో బోణీ చేసింది. బుధ, గురువారాల్లో జరిగే మిగిలిన రెండు మ్యాచ్‌లకు కూడా లాహోర్ ఆతిథ్యమివ్వనుంది.