క్రీడాభూమి

2015 నాటి చెక్ జట్టుకన్నా బలమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: 2015లో డేవిస్ కప్ ప్లే ఆఫ్స్ దశలో భారత్ ఓటమి పాలయిన చెక్ రిపబ్లిక్ జట్టుకన్నా ప్రస్తుత కెనడా జట్టు బలమైనదని భారత డేవిస్ కప్ జట్టు కెప్టెన్ మహేశ్ భూపతి అభిప్రాయ పడ్డాడు. న్యూయార్క్‌లో వారం రోజుల పాటు శిక్షణ అనంతరం వరసగా నాలుగోసారి వరల్డ్ గ్రూపునకు క్వాలిఫైకావడం కోసం భారత జట్టు కెనడాను ఢీకొనేందుకు మంగళవారం ఎడ్మంటన్‌ను చేరుకొంది. ఆసియా-ఓసియానా జోన్‌లో స్పష్టమైన ఆధిపత్యం చాటిన భారత జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశలో వరసగా మూడు సార్లు- 2014లో సెర్బియా, 2015లో చెక్ రిపబ్లిక్, 2016లో రఫెల్ నాదల్ నేతృత్వంలోని స్పెయిన్ చేతిలో ఓటమి పాయింది. శుక్రవారంనుంచి భారత్‌తో జరిగే ప్లే ఆఫ్స్ పోటీ కోసం కెనడా జట్టులో ప్రస్తుతం ప్రపంచ సింగిల్స్ ర్యాకింగ్స్‌లో 51వ స్థానంలో ఉన్న యువ ఆటగాడు, ఇటీవల యుఎస్ ఓపెన్ టోర్నమెంట్‌లో నాలుగో రౌండ్‌కు చేరుకొన్న షపొవలోవ్, వాసెక్ పోస్పిసిల్‌తో పాటుగా డబుల్స్‌లో 43వ ర్యాంక్ ఆటగాడు డేనియల్ నెస్టర్, బ్రేడెన్ ష్నుర్‌లను ఎంపిక చేశారు. 18 ఏళ్ల షపొవలోవ్ ఇటీవలి కాలంలో అంతర్జాతీయ టోర్నమెంట్లలో సంచలనాలు సృష్టిస్తూ వస్తున్నాడు. మాంట్రియల్ మాస్టర్స్ టోర్నీలో సెమీఫైనల్ దాకా చేరుకొనే మార్గంలో అతను నాదల్‌పై కూడా సంచలన విజయం సాధించడం తెలిసిందే. ఇటీవలే ముగిసిన యుఎస్ ఓపెన్‌లో సైతం నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు.