క్రీడాభూమి

భారత క్రికెట్‌కు అది ఓ పీడకల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 12: భారత క్రికెట్ జట్టుకు 2006-07 అత్యంత దారుణమైన సమయమని, అది ఓ పీడకల లాంటిదని , ఆ సమయంలో జట్టు అట్టడుగు స్థాయికి చేరుకుందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ అభిప్రాయ పడ్డారు. వెస్టిండీస్‌లో జరిగిన 2007 ప్రపంచ కప్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన తర్వాత భారతజట్టులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, అవన్నీ భారీ సత్ఫలితాలనిచ్చాయని కూడా ఆయన అన్నాడు. ‘2006-07 సంవత్సరం భారత జట్టుకు అత్యంత దారుణమైన కాలమని నేను అనుకొంటున్నాయి. 2008లో సూపర్-8 దశకు కూడా మేము క్వాలిఫై కాలేదు. అయితే ఆ తర్వాత అక్కడినుంచి మేల్కొని కొత్త ఆలోచనలు చేయడం ప్రారంభించాం, కొత్త మార్గంలో పయనించడం మొదలుపెట్టాం’ అని మంగళవారం ఇక్కడొక కార్యక్రమంలో పాల్గొన్న తెండూల్కర్ అన్నాడు. తాము బోలెడన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని, అయితే ఒక జట్టుగా ఏం సాధించాలో ప్రణాళికను రూపొందించుకున్న దానికి తాము కట్టుబడి ఉన్నామని, ఆ తర్వాత ఫలితాలు వాటికవే రావడం మొదలైనాయని కూడా ఆయన చెప్పాడు.