క్రీడాభూమి

బెల్జియం పురుషుల హాకీ జట్టుతో దీటుగా తలపడిన భారత మహిళా జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంట్వెర్ప్ (బెల్జియం), సెప్టెంబర్ 12: బెల్జియం పురుషుల జూనియర్ జట్టుతో జరిగిన హాకీ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు దీటుగా తలపడింది. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగించింది. ఆరంభం నుంచే ఈ మ్యాచ్ హోరాహోరీగా జరిగినప్పటికీ ఫస్ట్ క్వార్టర్‌లో ఇరు జట్లు ఒక్క గోల్‌ను కూడా సాధించలేకపోయాయి. అయితే 19వ నిమిషంలో స్టాన్ బ్రానికీ సాధించిన గోల్‌తో బెల్జియం జట్టు ప్రథమార్థం ముగిసే సమయానికి 1-0 గోల్ ఆధిక్యతలో నిలిచింది. దీంతో థర్డ్ క్వార్టర్‌లో మరింత విజృంభించి ఆడిన భారత జట్టుకు నిక్కీ ప్రధాన్ 36వ నిమిషంలో తొలి గోల్‌ను అందించడంతో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. అయితే 43వ నిమిషంలో మథియు డీ లాయెడ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ సాధించడంతో మళ్లీ ఆధిక్యతలోకి దూసుకెళ్లిన బెల్జియం జట్టు ఫోర్త్ క్వార్టర్‌లో కూడా గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత జట్టుకు 54వ నిమిషంలో వందనా కటారియా గోల్ సాధించి పెట్టడంతో ఈ మ్యాచ్ 2-2 గోల్స్‌తో డ్రాగా ముగిసింది.