క్రీడాభూమి

రైనాకు త్రుటిలో తప్పిన ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటావా, సెప్టెంబర్ 12: భారత క్రికెటర్ సురేష్ రైనా తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. టీమిండియాలో చోటు కోల్పోయినప్పటికీ ప్రస్తుతం దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో ఇండియా బ్లూ జట్టుకు సారథ్యం వహిస్తున్న రైనా కాన్పూర్‌లో బుధవారం జరిగే మ్యాచ్‌లో ఆడేందుకు తన రేంజ్ రోవర్ కారులో మంగళవారం ఘజియాబాద్ నుంచి బయలుదేరాడు. అయితే తెల్లవారు జామున దాదాపు 2 గంటల సమయంలో రైనా ఇటావా సమీపంలోని ఫ్రెండ్స్ కాలనీ వద్దకు చేరుకున్న తర్వాత ఆ కారు వెనుక టైర్లలో ఒకటి పేలిపోయింది. ఈ ప్రమాదం నుంచి రైనా ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడని, ఆ సమయంలో కారును నడిపి ఉన్నట్లయితే పెను ముప్పు వాటిల్లి ఉండేదని పోలీసులు తెలిపారు. కారులో స్పేర్ టైరు లేకపోవడంతో రైనా కొంతసేపు అక్కడ నిలిచిపోవాల్సి వచ్చిందని, స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో వారు మరో వాహనంలో రైనాను కాన్పూర్‌కు పంపించారని డిఎస్‌పి రాజేష్ కుమార్ సింగ్ వివరించారు.