క్రీడాభూమి

వామప్‌లో ఆసీస్ సత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 12: టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడేందుకు ఆస్ట్రేలియా జట్టు తమదైన శైలిలో సిద్ధమైంది. ఈ సిరీస్‌కు ముందు మంగళవారం చెన్నైలో జరిగిన ఏకైక సన్నాహక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 103 పరుగుల తేడాతో ఆతిథ్య బోర్డు ప్రెసిడెండ్స్ ఎలెవెన్ జట్టును మట్టికరిపించి సత్తా చాటుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టులో ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ 60 బంతుల్లో 76 పరుగులు సాధించగా, అతనితో పాటు ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కూడా అర్థ శతకాలతో రాణించారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు సాధించగా, ఆ తర్వాత యువ ఆటగాళ్లతో కూడిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టు కంగారూలతో ఏమాత్రం పోరాడలేకపోయింది. ప్రత్యేకించి మిడిలార్డర్ బ్యాట్స్‌మన్లు ఘోరంగా విఫలమవడంతో 48.2 ఓవర్లలో 244 పరుగులకే ఆలౌటైన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టు 103 పరుగుల భారీ తేడాతో చతికిలబడింది.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు పరుగుల ఖాతా ఆరంభించకుండానే కార్ట్‌రైట్ వికెట్‌ను కోల్పోయింది. అయితే ఓపెనర్ డేవిడ్ వార్నర్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్రీజ్‌లో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. ప్రెసిడెంట్స్ ఎలెవన్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించిన వీరు చెరో అర్థ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు రెండో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం వార్నర్ (48 బంతుల్లో 64 పరుగులు) కుషాంగ్ పటేల్ బౌలింగ్‌లో వికెట్ల వెనుక గోస్వామి చేతికి చిక్కగా, కొద్దిసేపటికి స్టీవ్ స్మిత్ (68 బంతుల్లో 55 పరుగులు),తో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (25 బంతుల్లో 14 పరుగులు) కూడా నిష్క్రమించారు. ఈ తరుణంలో ట్రవిస్ హెడ్ (63 బంతుల్లో 65 పరుగులు), మార్కస్ స్టొయినిస్ (60 బంతుల్లో 76 పరుగులు) చెరో అర్థ శతకంతో రాణించి వెనుదిరగ్గా, ధాటిగా ఆడిన వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ 24 బంతుల్లో 45 పరుగులు సాధించి నిష్క్రమించాడు. చివర్లో జేమ్స్ ఫాల్క్‌నర్ (8), అష్టోన్ అగర్ (8) అజేయంగా నిలువడంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, కుషాంగ్ పటేల్ చెరో రెండు వికెట్లు కైవసం చేసుకోగా, ఆవేశ్ ఖాన్, ఖెజ్రోలియా, కార్నేవర్ ఒక్కో వికెట్‌తో సరిపుచ్చుకున్నారు.
అనంతరం 348 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు 10 పరుగులకే ఆర్‌ఎ.త్రిపాఠీ (7) వికెట్‌ను కోల్పోయింది. అయితే ఓపెనర్ శ్రీవత్స్ గోస్వామి (54 బంతుల్లో 43 పరుగులు), మయాంక్ అగర్వాల్ (47 బంతుల్లో 42 పరుగులు) స్థిమితంగా ఆడి రెండో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వీరి నిష్క్రమణ తర్వాత ఎన్.రాణా, ఎస్.చౌదరి, కెప్టెన్ గురుకీర్త్ సింగ్ , జిబి.పొద్దర్, వాషింగ్టన్ సుందర్ స్వల్పస్కోర్లకే పెవిలియన్‌కు పరుగు తీయగా, చివర్లో ధాటిగా ఆడిన ఎకె.కార్నేవర్ 28 బంతుల్లో 40 పరుగులు సాధించి నిష్క్రమించాడు. ఆ తర్వాత కుషాంగ్ పటేల్ (48 బంతుల్లో 41 పరుగులు) అజేయంగా నిలిచినప్పటికీ టెయిలెండర్ ఆర్‌ఎస్.షా కేవలం 3 పరుగులకే వెనుదరిగాడు. దీంతో 48.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టు 103 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో అష్టోన్ అగర్ 44 పరుగులకు 4 వికెట్లు కైవసం చేసుకుని ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించగా, కెడబ్ల్యు.రిచర్డ్‌సన్ రెండు వికెట్లు, జేమ్స్ ఫాల్క్‌నర్, ఆడమ్ జంపా, మార్కస్ స్టొయినిస్ ఒక్కో వికెట్ అందుకున్నారు.

చిత్రం..60 బంతుల్లో 76 పరుగులు సాధించిన మార్కస్ స్టొయినిస్