క్రీడాభూమి

అలవోక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్: ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపి యన్‌షిప్‌లో గురువారం ఏమాత్రం ప్రాధాన్యతలేని మ్యా చ్‌లో టీమిండియా అలవోకగా విజయాన్ని నమోదు చే సింది. క్రికెట్ పసికూన జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో తలపడిన భారత్ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిం చింది. బెంచ్ బలాన్ని బేరీజు వేసుకోవడానికి ఈ మ్యాచ్ లో హర్భజన్ సింగ్, పవన్ నేగీ, భువనేశ్వర్ కుమార్‌లకు స్థానం కల్పించారు. తమకు లభించిన అవకాశాన్ని వీరు స ద్వినియోగం చేసుకున్నారు. బౌలర్లు చెలరేగిపోవడంతో యుఎఇ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయ 81 పరుగులు చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని భారత్ తొమ్మిది వికెట్ల తేడా తో ఛేదించింది. ఇప్పటికే ఫైనల్ చేరిన టీమిండియా ఈ మ్యాచ్‌ని ప్రాక్టీస్ సెషన్ కింద తీసుకుంది. సునాయాస విజయాన్ని సాధించింది. ఈనెల ఆరో తేదీన జరిగే ఫైనల్ లో బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ కొంటుంది.
ఆరంభం నుంచే తడబాటు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యుఎఇ ఆరంభం నుంచే తడబడింది. కేవలం ఒక పరుగు వద్ద స్వాప్నిల్ పాటిల్ (1) అవుటయ్యాడు. ఇప్పటి వరకూ బెంచ్‌కే పరిమితమైన భువనేశ్వర్ కుమార్ రిటర్న్ క్యాచ్ అందుకొని భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. రెండు పరుగుల వద్ద మహమ్మద్ షెజాద్ (0) కూడా పెవిలియన్ చేరాడు. సురేష్ రైనా క్యాచ్ అందుకోగా జస్‌ప్రీత్ బుమ్రా అతనిని అవుట్ చేశాడు. ఆతర్వాత యుఎఇ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. షైమన్ అన్వర్ ఒంటరి పోరాటం చేసినా, మిగతా బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ రాణించలేకపోయారు. అన్వర్ 48 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 పరుగులు చేసి, చివరి ఓవర్ ఐదో బంతికి రనౌటయ్యాడు. అతనిని తప్పిస్తే యుఎఇ బ్యాట్స్‌మెన్ అంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడం విశేషం. 20 ఓవర్లలో ఆ జట్టు తొమ్మిది వికెట్లకు 81 పరుగులు చేయగా, అప్పటికి మహమ్మద్ రజా, ఖాదిర్ అహ్మద్ తమతమ ఖాతాలను తెరవకుండా క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ నాలుగు ఓవర్లలో కేవలం ఎనిమిది పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, హర్భజన్ సింగ్, పవన్ నేగీ, యువరాజ్ సింగ్ తలా ఒక్కో వికెట్ సాధించారు.
ఏమాత్రం భయపెట్టలేకపోయన లక్ష్యాన్ని భారత జట్టు సునాయాసంగా ఛేదించింది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మొదటి వికెట్‌కు 43 పరుగులు జోడించారు. 28 బంతు లు ఎదుర్కొని, 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 39 పరుగులు చేసి న రోహిత్ శర్మను మహమ్మద్ నవీద్ క్యాచ్ అందుకోగా, ఖదీర్ అహ్మద్ అవుట్ చేశాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన యువరాజ్ సింగ్ మరో వికెట్ కూలకుండా జాగ్ర త్త పడ్డాడు. ధాటిగా ఆడిన అతను మహమ్మద్ షెజాద్ వేసి న 11వ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించి, ఇంకా 59 బంతులు మిగిలి ఉండగానే టీమిండియాను గెలిపించా డు. 10.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 82 పరుగులు చేసి భారత్ గెలిచే సమయానికి యువీ 25 (14 బంతులు, 4 ఫోర్లు, ఒక సిక్సర్), ధావన్ 16 (20 బంతులు, 3 ఫోర్లు) నాటౌట్‌గా ఉన్నారు.
స్కోరుబోర్డు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: రోహన్ ముస్త్ఫా సి కోహ్లీ బి హార్దిక్ పాండ్య 11, స్వాప్నిల్ పాటిల్ సి అండ్ బి భువనేశ్వర్ కుమార్ 01, మహమ్మద్ షెజాద్ సి సురేష్ రైనా బి జస్‌ప్రీత్ బుమ్రా 0, షైమన్ అన్వర్ రనౌట్ 43, మహమ్మద్ ఉస్మాన్ సి హర్భజన్ సింగ్ బి పవన్ నేగీ 09, అంజాద్ జావేద్ సి పవన్ నేగీ బి హర్భజన్ సింగ్ 0, మహమ్మద్ ఖలీమ్ సి హార్దిక్ పాండ్య బి యువరాజ్ సింగ్ 02, ఫవాద్ తారిఖ్ రనౌట్ 03, మహమ్మద్ నవీద్ సి పవన్ నేగి బి భువనేశ్వర్ కుమార్ 05, అహ్మద్ రజా నాటౌట్ 0, ఖదీర్ అహ్మద్ నాటౌట్ 0, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 81.
వికెట్ల పతనం: 1-1, 2-2, 3-25, 4-51, 5-53, 6-62, 7-66, 8-80, 9-81.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-2-8-2, జస్‌ప్రీత్ బుమ్రా 4-0-23-1, హార్దిక్ పాండ్య 3-1-11-1, హర్భజన్ సింగ్ 4-1-11-1, పవన్ నేగి 3-0-16-1, యువరాజ్ సింగ్ 2-0-10-1.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సి మహమ్మద్ నవీద్ బి ఖదీర్ అహ్మద్ 39, శిఖర్ ధావన్ నాటౌట్ 16, యువరాజ్ సింగ్ నాటౌట్ 25, ఎక్‌స్ట్రాలు 2, మొత్తం (10.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 82.
వికెట్ల పతనం: 1-43.
బౌలింగ్: మహమ్మద్ నవీద్ 4-0-2-0, అంజాద్ జావేద్ 2-0-18-0, ఖదీర్ అహ్మద్ 2-0-23-1, మహమ్మద్ షెజాద్ 1.1-0-14-0, రోహన్ ముస్త్ఫా 1-0-6-0.

చిత్రం... రిటర్న్ క్యాచ్ పట్టుకొని స్వాప్నిల్ పాటిల్‌ను అవుట్ చేయడం ద్వారా యుఎఇని తొలి దెబ్బతీసిన
భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు సహచరుల అభినందన