క్రీడాభూమి

టైటిల్ దిశగా సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, సెప్టెంబర్ 16: భారత బాడ్మింటన్ స్టార్ పివి సింధు ఇక్కడ జరుగుతున్న కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ టైటిల్ దిశగా దూసుకెళుతున్నది. 22 ఏళ్ల ఈ తెలుగు తేజం సెమీ ఫైనల్‌లో చైనాకు చెందిన హి బింగ్‌జియావోను 21-10, 17-21, 21-16 తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. చివరి అడ్డంకిగా ఉన్న ప్రపంచ చాంపియన్ నొజోమీ ఒకుహరా (జపాన్)ను తుది పోరాటంలో ఓడిస్తే సింధుకు టైటిల్ దక్కుతుంది. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన ఒకుహరా సెమీ ఫైనల్‌లో తన దేశానికే చెందిన రెండో సీడ్ యకానే యమాగుచీపై 21-17, 21-18 ఆధిక్యంతో విజయం సాధించింది. సింధు ఫైనల్ చేరేందుకు మూడు సెట్లు అవసరంకాగా, ఒకుహరా వరుస సెట్లలోనే గెలుపొందడం గమనార్హం. ఇలావుంటే, పురుషుల సింగిల్స్‌లో ఆంథోనీ సినిసుకా గింటింగ్, జొనథాన్ క్రిస్ట్రీ ఫైనల్ చేరారు. గింటింగ్ 16-21, 21-18, 21-13 ఆధిక్యంతో నంబర్ వన్ సీడ్ సన్ వాన్ హోపై సంచలన విజయాన్ని నమోదు చేశాడు. మరో సెమీ ఫైనల్‌లో క్రిస్టీ 21-13, 21-17 తేడాతో ఏడో సీడ్ జూ వెయ్ వాంగ్‌పై గెలిచాడు.

చిత్రం.. సింధు