క్రీడాభూమి

కుల్దీప్‌తో కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 16: భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బంతులను ఎదుర్కోవడం అంత సులభం కాదని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. తుది జట్టులో కుల్దీప్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, అతనిని సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఆదివారం భారత్‌తో జరిగే మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌కు సిద్ధమైన స్మిత్ చెప్పాడు. కుల్దీప్ మాదిరిగానే ‘చైనామన్’ బౌలింగ్ చేసే కెకె జియాస్‌తో నెట్‌లో బౌలింగ్ వేయించి, ప్రాక్టీస్‌ను కొనసాగించినట్టు స్మిత్ చెప్పాడు. ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్‌తో కలిసి గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపిఎల్‌లో జియాస్ ఆడాడు. అందుకే నెట్స్‌లో అతని సహకారం తీసుకున్నామని స్మిత్ తెలిపాడు. ప్రపంచ క్రికెట్‌లో చాలా తక్కువ మంది ‘చైనామన్’ బౌలర్లు ఉన్నారని, కాబట్టి, వారిని ఎదుర్కోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పాడు. కుల్దీప్‌ను సమర్థుడిగా అభివర్ణించిన స్మిత్ అతనికి తుది జట్టులో తప్పక స్థానం లభిస్తుందని జోస్యం చెప్పాడు. 2013లో తాము చెన్నైలో మ్యాచ్ ఆడామని, ఇక్కడి పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించేదని అన్నాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపాడు.