క్రీడాభూమి

ఇటు రాంకుమార్ అటు షపొవలోవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడ్మాంటన్ (కెనడా), సెప్టెంబర్ 16: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భారత్ తరఫున రాంకుమార్ రామనాథన్ శుభారంభం చేయగా, మరో మ్యాచ్‌లో కెనడా యువ సంచలనం డెనిస్ షపొవలోవ్ గెలిచాడు. దీనితో రెండు సింగిల్స్ మ్యాచ్‌లు ముగిసే సమయానికి ఇరు దేశాలు చెరొక విజయంతో సమవుజ్జీలుగా నిలిచాయి. మొదటి సింగిల్స్‌లో రాంకుమార్ 5-7, 7-6, 7-5, 7-5 తేడాతో బ్రేడన్ షనర్‌ను ఓడించి, భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే, అందరూ ముందుగా ఊహించిన విధంగానే 18 ఏళ్ల కెనడా ఆటగాడు షపొవలోవ్ కెనడాకు విజయాన్ని సాధించిపెట్టాడు. అపారమైన అనుభవం ఉన్న యుకీ భంబ్రీని అతను 7-6, 6-4, 6-7, 4-6, 6-1 తేడాతో ఓడించాడు. మొదటి రెండు సెట్లను అతి కష్టం మీద గెల్చుకున్న షపొవలోవ్‌కు ఆతర్వాత రెండు సెట్లలో యుకీ నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పలేదు. దీనితో ఆ రెండు సెట్లను అతను కోల్పోయాడు. అయితే, అత్యంత కీలకమైన చివరి సెట్‌లో షపొవలోవ్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. ఆ సెట్‌ను సొంతం చేసుకోవడం ద్వారా, కెనడాను భారత్‌తో సమానంగా నిలిపాడు.

చిత్రం..రాంకుమార్ రామనాథన్