క్రీడాభూమి

రవి శాస్ర్తీ ప్రయోగాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: వచ్చే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను దృష్టిలో ఉంచుకొని, అప్పటి జట్టు కూర్పు ఎలా ఉండాలనే విషయంలో కోచ్ రవి శాస్ర్తీ ప్రయోగాలు చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాను జాతీయ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయకపోవడం ఈ విషయాన్ని చెప్పకనే చెప్తున్నది. సెలక్షన్ కమిటీ సభ్యులు జట్టును ఎంపిక చేసే సమయంలో కెప్టెన్, కోచ్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా మండలి జహీర్ ఖాన్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసినప్పటికీ, రవి శాస్ర్తీ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనితో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సలహా మండలి తీసుకున్న నిర్ణయాన్ని కాదని, రవి శాస్ర్తీ కోరిక మేరకు జహీర్ స్థానంలో భరత్ అరుణ్‌ను నియమించారు. భారత క్రికెట్‌పై రవి శాస్ర్తీ పట్టు బిగిస్తున్నాడనడానికి ఇదో ఉదాహరణ. ఆసీస్‌తో జరిగే మొదటి మూడు వనే్డ మ్యాచ్‌ల కోసం జట్టు ఎంపిక జరిగినప్పుడు, అతను జోక్యం చేసుకొని ఉంటాడన్నది బహిరంగ రహస్యం. సపోర్టింగ్ స్ట్ఫా విషయంలోనే అనుకున్నది సాధించుకున్న అతను జట్టు ఎంపికలో ప్రేక్షక పాత్ర పోషిస్తాడని అనుకోవడానికి వీల్లేదు. యువరాజ్ సింగ్‌కు అవకాశం ఇవ్వకపోయినా, సురేష్ రైనాకు మొండి చేయి చూపించినా అంతగా అభ్యంతరాలు వ్యక్తంకాలేదుగానీ, స్టార్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాను మొదటి మూడు వనే్డలకు ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియన్లు స్పిన్ ఆడడానికి ఇబ్బంది పడతారు. స్పిన్‌కు సహకరించే పిచ్‌లపై అశ్విన్, జడేజా అద్భుతాలు సృష్టిస్తారని ఇంతకు ముందు ఎన్నో సందర్భాల్లో రుజువైంది. కానీ, సెలక్టర్లు మాత్రం వీరిద్దరికీ మరోసారి విశ్రాంతినిచ్చారు. అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌ను జట్టులో కొనసాగించాలని నిర్ణయించడంతో, ఏఏ అంశాల ప్రాతిపదికన ఆటగాళ్ల ఎంపిక జరిగిందనే ప్రశ్న తెరపైకి వచ్చింది. అశ్విన్, జడేజాను ప్రతి మ్యాచ్‌లోనూ ఆడించడం అసాధ్యమని, జట్టు అవసరాలు, భవిష్యత్తు సిరీస్‌లు వంటి అనేకానేక అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆటగాళ్ల ఎంపిక జరుగుతుందని రవి శాస్ర్తీ స్పష్టం చేస్తున్నాడు. జాతీయ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను సమర్థించే ప్రయత్నం చేశాడు. 2019 ప్రపంచ కప్ కోసం బెంచ్ బలాన్ని బేరీజు వేసుకోవడానికి, యువ ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు కల్పించడానికి అవసరమైన ప్రయోగాలు చేయాలన్నది అతని ధ్యేయంగా కనిపిస్తున్నది. స్టార్‌డమ్‌ను గురించి పట్టించుకోకుండా, జట్టు అవసరాలను గుర్తించి, అందుకు తగినట్టుగానే ఆటగాళ్లను ఎంపిక చేయడం అన్నది హర్షించతగ్గ విషయమే. అయితే, మహేంద్ర సింగ్ ధోనీ వంటి సీనియర్ ఆటగాళ్ల విషయంలో ఈ సూత్రాన్ని ఎందుకు విస్మరిస్తున్నాడనేదే ప్రశ్న. ఇటీవల కాలంలో ధోనీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మాట వాస్తవం. ప్రస్తుతం అతను జట్టుకు అండగా నిలిచి, కీలక ఇన్నింగ్స్ ఆడుతూ విజయాలను అందిస్తున్నాడనేది కూడా నిజమే. కానీ, మరో రెండేళ్లపాటు అతను ఇదే స్థాయిలో రాణిస్తాడన్న గ్యారంటీ లేదు. రొటేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామంటూ కొంత మంది ఆటగాళ్లకు బలవంతంగా విశ్రాంతిస్తున్న సెలక్టర్లు ధోనీకి ఎందుకు మినహాయింపునిస్తున్నరు. వృషభ్ పంత్, ఇషాన్ కిషన్ వంటి యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మెన్‌కు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదు. ప్రయోగాలకు వారు పనికిరారా? 2019 వరల్డ్ కప్‌లో ఆడే సత్తా వారికి లేదా? ఒకరికి ఒక నీతి, మరొకరికి మరో నీతిని అవలంభించడం ఎంత వరకూ సమంజసం? సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్న ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కోచ్ రవి శాస్ర్తీ, జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యులపై ఉంది. వారి హడావుడి ప్రకటనలు, చేస్తున్న వాదనలు, ఇస్తున్న వివరణలు ఆమోదయోగ్యంగా లేవన్నది ముమ్మాటికీ నిజం.
అశ్విన్, జడేజా సంప్రదాయ స్పిన్‌తో పోలిస్తే, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ రూపంలో మూడు భిన్నమైన ప్రత్యేకతలున్న స్పిన్నర్లు కెప్టెన్ విరాట్ కోహ్లీకి లభించారన్న వాదన వినిపిస్తున్నది. అక్షర్ ఎడమచేతి వాటం స్పిన్నర్‌కాగా, చాహల్‌ది కుడిచేతి వాటం. ఇక కుల్దీప్ 3చైనామన్2 బంతులను సంధిస్తాడు. పిచ్ తీరును, ప్రత్యర్థి ఆటగాళ్ల బలాబలాలను అనుసరించి, ఈ మూడు కాంబినేషన్లను సమయానుకూలంగా వినయోగించుకునే అవకాశం కోహ్లీకి లభిస్తుంది. అందుకే, అశ్విన్, జడేజాను సెలక్షన్ కమిటీ చిన్న చూపు చూస్తున్నదని, అందుకు రవి శాస్ర్తీ ప్రోత్సాహం కూడా జత కలిసిందని వాదనలు ఉన్నాయి. లేకపోతే, నిరుడు ఆసీస్ జట్టు మన దేశంలో పర్యటించినది మొదలు, ఇప్పటి వరకూ అశ్విన్ 20 టెస్టులు ఆడి, 1,014 ఓవర్లు బౌల్ చేశాడు. 116 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, జడేజా 16 మ్యాచ్‌లు ఆడి, 855 ఓవర్లు వేశాడు. 87 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే, ఆసీస్‌తో జరిగే మొదటి మూడు మ్యాచ్‌లకు ప్రకటించిన టీమిండియాలో వీరిద్దరికీ చోటు దక్కి తీరాలి. కానీ, కోచ్ రవి శాస్ర్తీ సూచనలతో సెలక్టర్లు వీరిద్దరికీ విశ్రాంతినిచ్చారని అంటున్నారు. అదే నిజమైతే, అతని వ్యూహం ఏమిటనేది ప్రస్తుతానికి చిదంబర రహస్యం.