క్రీడాభూమి

రికార్డుల కోసం ఆడను: కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 16: తాను రికార్డుల కోసం ఆడబోనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. వనే్డ ఫార్మాట్‌లో ఇప్పటి వరకూ 30 సెంచరీలు చేసిన అతను అత్యధిక శతకాల జాబితాలో రికీ పాంటింగ్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ తెండూల్కర్ మొత్తం 49 సెంచరీలతో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ మరో సెంచరీ చేస్తే, పాంటింగ్‌ను మూడో స్థానానికి నెట్టి, తాను ఒక్కడే రెండో స్థానంలో నిలుస్తాడు. ఆసీస్‌తో మొదటి వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌కి సిద్ధమైన అతను శనివారం విలేఖరులతో మాట్లాడుతూ సెంచరీల కోసమో, రికార్డుల కోసమో తాను క్రికెట్ ఆడనని తేల్చిచెప్పాడు. ఒకవేళ జట్టుకు ప్రయోజనం కలిగిస్తే, 98 లేదా 99 పరుగుల వద్ద అవుటైనా బాధపడనని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ లోకేష్ రాహుల్‌కు మ్యాచ్‌లను గెలిపించే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని పేర్కొన్నాడు. జట్టు తుది కూర్పు ఏ విధంగా ఉంటుందో చెప్పలేనని మరో ప్రశ్నపై స్పందిస్తూ అన్నాడు.