క్రీడాభూమి

పారా మిలటరీని పంపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఈ నెల 19వ తేదీన ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌కు ఆటంకాలు ఎదురవకుండా చూసేందుకు పారా మిలటరీ బలగాలను పంపిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు జనవరిలో దాడికి పాల్పడటాన్ని నిరసిస్తూ హిమాచల్‌ప్రదేశ్‌లోని మాజీ సైనికోద్యోగులు ఈ మ్యాచ్ నిర్వహణను వ్యతిరేకిస్తుండటంతో రాజ్‌నాథ్ సింగ్ ఈ హామీ ఇచ్చారు. ఈ మ్యాచ్‌ను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలను పంపాలని హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కోరితే తప్పకుండా పంపిస్తామని రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం న్యూఢిల్లీలో విలేఖర్లకు తెలిపారు. రాష్ట్రంలో మాజీ సైనికోద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నందున ఈ మ్యాచ్‌కు తాము భద్రత కల్పించలేమని స్పష్టం చేస్తూ వీరభద్ర సింగ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ‘క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణను వారు వ్యతిరేకించడం లేదు. రాష్ట్రంలో పాక్ జట్టు ఆడటాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు’ అని వీరభద్ర సింగ్ ఆ లేఖలో తెలిపారు.

భారత్‌కు సెక్యూరిటీ టీమ్

టి-20 ప్రపంచ కప్‌పై పాకిస్తాన్ నిర్ణయం
ఇస్లామాబాద్, మార్చి 4: మన దేశంలో జరిగే టి-20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ పాల్గొనడంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. భారత్‌లో పరిస్థితిని అంచనా వేయడానికి ఒక భద్రతా బృందాన్ని పంపించాలని పాక్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించడంతో ఈ ప్రతిష్టంభన పరిష్కారం మరింత జాప్యం అయ్యే అవకాశాలున్నాయి. భారత్‌లో పాక్ జట్టు భద్రతకు సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నెల 8నుంచి ఏప్రిల్ 3 దాకా జరిగే ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనడానికి తమ క్రికెట్ జట్టుకు మొదట అనుమతించిన ప్రభుత్వం ఇప్పుడు భారత్ వెళ్లే భద్రతా బృందం తిరిగి వచ్చి నివేదిక సమర్పించిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్తోంది. పాక్ క్రికెట్ జట్టుకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని బిసిసిఐ హామీ ఇచ్చినప్పటికీ దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఈ అంశంపై చర్చించడానికి పాక్ హోం మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ ఇస్లామాబాద్‌లో ప్రధాని నవాజ్ షరీఫ్‌ను శుక్రవారం కలిశారు. భారత్‌కు భద్రతా బృందాన్ని పంపించాలన్న నిర్ణయం ఈ సమావేశం తర్వాతే తీసుకున్నారు. ‘్భరత్‌లో పరిస్థితిని సమీక్షించడం కోసం ఒక సెక్యూరిటీ బృందాన్ని ముందుగా భారత్‌కు పంపించాలని ప్రధాని షరీఫ్ హోం మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషనర్ సమన్వయంతో అక్కడ పాక్ క్రికెట్ జట్టుకు పూర్తిస్థాయి భద్రతా చర్యలు తీసుకునేలా చూడాలని ప్రధానమంత్రి హోంమంత్రిత్వ శాఖను ఆదేశించారు’ అని హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.