క్రీడాభూమి

జాన్ హిగ్గిన్స్‌కు స్నూకర్ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), సెప్టెంబర్ 16: ఇండియన్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ స్నూకర్ టైటిల్‌ను స్కాట్లాండ్‌కు చెందిన జాన్ హిగ్గిన్స్ కేవసం చేసుకున్నాడు. కాగా, డిఫెండింగ్ చాంపియన్ ఆంథోని మెక్‌గిల్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఇక్కడి నోవాటెల్ హోటల్‌లో శనివారం స్కాట్లాండ్ ఆటగాళ్ల మధ్య జరిగిన ఫైనల్ పోటీలో వరల్డ్ నెంబర్ త్రీ జాన్ హిగ్గిన్స్ అనుభవం ముందు మెక్‌గిల్ తలవంచక తప్పలేదు. తొమ్మిది ఫ్రేముల ఈ ఫైనల్ పోటీలో హిగ్గిన్స్ 5-1 (70-2, 84-43, 28-78, 71-0, 71-35, 104-1) ఫ్రేముల ఆధిక్యతతో గెలుపొందాడు. ప్రారంభంలో 2-1 గేములతో ఆధిక్యతలోకి వచ్చిన హిగ్గిన్స్ ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. తరువాత జరిగిన మూడు ఫ్రేముల్లో వరుసగా తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. మెక్‌గిల్‌కు చివరి రెండు ఫ్రేముల్లో అవకాశం వచ్చినా వరుస తప్పిదాలతో ప్రత్యర్థికి గెలిచే అవకాశాన్ని ఇచ్చాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ పోటీలో ఆంథోనీ మెక్‌గిల్ 4-3 స్కోరుతో మార్క్‌క్విన్ (ఇంగ్లాడ్)పై, జాన్ హిగ్గిన్స్ 4-2 స్కోరుతో జ్యూసీ (చైనా)పై గెలుపొంది ఫైనల్స్‌కు చేరుకున్నారు. విజేతకు మంత్రి గంటా శ్రీనివాసరావు ట్రోఫీని అందజేశారు.

చిత్రం..వరల్డ్ ర్యాంకింగ్ స్నూకర్ విజేత జాన్ హిగ్గిన్స్‌కు ట్రోఫీని అందచేస్తున్న గంటా శ్రీనివాసరావు