క్రీడాభూమి

చామర సిల్వపై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, సెప్టెంబర్ 17: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీలంక మాజీ బ్యాట్స్‌మన్ చామర సిల్వలపై సస్పెన్షన్ వేటు పడింది. టైర్ ‘బి’ స్థాయి పోటీల్లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, పనాదురా క్రికెట్ క్లబ్, కలుతరా ఫిజికల్ కల్చర్ క్లబ్ మధ్య ఈ ఏడాది జనవరి 23 నుంచి 25వ తేదీ వరకు జరిగిన మ్యాచ్‌ని అతను ఫిక్స్ చేశాడని విచారణ కమిటీ నిర్ధారించింది. ఏడు నెలల సుదీర్ఘ విచారణ తర్వాత, అన్ని సాక్ష్యాధారాలతో చామర సిల్వ దోషి అని తేల్చడంతో శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) అతనిని రెండేళ్లు సస్పెండ్ చేసింది. 1999-2011 మధ్యకాలంలో చామర సిల్వ శ్రీలంక తరఫున 11 టెస్టులు, 75 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడాడు.