క్రీడాభూమి

మెరుగైన వ్యూహాలతో సిద్ధమవుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 18: భారత్‌తో జరిగిన మొదటి వనే్డను చేజార్చుకున్నప్పటికీ, మిగతా మ్యాచ్‌లకు మెరుగైన వ్యూహాలతో సిద్ధమవుతామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ మొదటి మ్యాచ్‌లో ముందుగా సిద్ధం చేసుకున్న వ్యూహాలను సక్రమంగా అమలు చేయలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. ఒక మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరో నాలుగు మ్యాచ్‌లు చేతిలో ఉన్నాయని స్మిత్ వ్యాఖ్యానించాడు. కోల్‌కతాలో 21న రెండో వనే్డ జరుగుతుందని, హోరాహోరీ పోరాటానికి సమయత్తమయ్యేందుకు తగినంత సమయం ఉందని చెప్పాడు. మొదటి వనే్డపై వర్షం కూడా తీవ్ర ప్రభావం చూపిందని స్మిత్ అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పాండ్య, ధోనీ అద్భుత భాగస్వామ్యం మ్యాచ్‌లో కీలక మలుపని అన్నాడు. వారిద్దరూ స్కోరును 87 నుంచి 206 పరుగులకు తీసుకెళ్లారని, ఒక రకంగా అది మ్యాచ్‌ని గెలిపించే భాగస్వామ్యమని చెప్పాడు. ఆస్ట్రేలియా ఫీల్డింగ్ మొదటి వనే్డలో నాసిరకంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. స్మిత్ స్వయంగా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య ఇచ్చిన క్యాచ్‌లను విడిచిపెట్టాడు. ఈ విషయాన్ని ప్రస్తావించగా, అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉంటే బాగుండేదని స్మిత్ వ్యాఖ్యానించాడు. తాను చేసిన పొరపాటు మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపిందని అన్నాడు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ, నాథన్ కౌల్టర్ నైల్‌తో బౌలింగ్‌ను మొదలుపెట్టి, పాట్ కమిన్స్‌తో ముగించాలన్నది తన వ్యూహమని అన్నాడు. అయితే, హార్దిక్, ధోనీ చక్కటి ఇన్నింగ్స్ ఆడడంతో తాను ముందుగా వేసుకున్న వ్యూహాలను సక్రమంగా అమలు చేయలేకపోయానని అన్నాడు. ఇక ముందు మెరుగైన వ్యూహాలతో రాణిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.