క్రీడాభూమి

ధోనీకి కలిసొచ్చిన ‘చేపాక్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 18: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చెన్నైలోని చేపాక్ (ఎంఎ చిదంబరం) స్టేడియం కలిసొచ్చిందని చెప్పాలి. ఈ మైదానంలో ధోనీ మొత్తం ఆరు ఇన్నింగ్స్ ఆడి, 401 పరుగులు చేశాడు. ఈ స్కోరులో రెండు శతకాలు, ఒక అర్ధ శతకం ఉన్నాయి. 100.25 సగటును అతను చేపాక్‌లో నమోదు చేశాడు. మరే ఇతర మైదానంలో అతనికి ఇంత భారీ సగటు లేదు. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వనే్డలో సాధించిన అర్ధ శతకం కెరీర్‌లో అతనికి 66వది. ఆసీస్‌పై ఐదో హాఫ్ సెంచరీ. ఈ ఏడాది అతను వనే్డల్లో 89.57 సగటుతో రాణించడం విశేషం. మొత్తం మీద ఈ ఏడాది 14 ఇన్నింగ్స్‌లో అతను 627 పరుగలు చేశాడు. ఇలావుంటే, శ్రీలంకతో జరిగిన వనే్డల్లో చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ధోనీ నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్‌తో ఆదివారం జరిగిన మొదటి వనే్డలో అతను 79 పరుగులు చేశాడు. మొత్తం మీద ఐదో ఇన్నింగ్స్‌లో, 241 పరుగులు సాధించిన తర్వాత అతను అవుటయ్యాడు.
వనే్డల్లో 200 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఐదో బ్యాట్స్‌మన్‌గా ధోనీ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. అతని ఖాతాలో ఇప్పుడు 212 సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో షాహిద్ అఫ్రిదీ 351, సనత్ జయసూర్య 270, క్రిస్ గేల్ 238 మొదటి మూడు స్థానాల్లో నిలవగా, ధోనీకి నాలుగో స్థానం లభించింది. బ్రెండన్ మెక్‌కలమ్ సరిగ్గా 200 సిక్సర్లు కొట్టాడు. వనే్డల్లో భారత్ విజయం సాధించిన ఇన్నింగ్స్‌లో ధోనీ సగటు 75.35 పరుగులు. టీమిండియా గెలిచిన 170 మ్యాచ్‌ల్లో కలిపి అతను మొత్తం 5,878 పరుగులు సాధించాడు. విజయాలను నమోదు చేసిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ధోనీకి అగ్రస్థానం దక్కింది. హార్దిక్ పాండ్యతో కలిసి మొదటి వనే్డలో ధోనీ 118 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ధోనీ 79 పరుగులకు అవుట్‌కాగా, పాండ్య 83 పరుగులు చేశాడు. భారత్ తరఫున ఒక వనే్డలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న బ్యాట్స్‌మెన్ అర్ధ శతకాలను నమోదు చేయడం ఇదే మొదటిసారి. అంతేగాక, వీరు భారత్‌లో ఆస్ట్రేలియాపై, ఆరో వికెట్‌కు అత్యధిక పార్ట్‌నర్‌షిప్‌ను అందించిన రికార్డును కూడా సొంతం చేసుకున్నారు.

చిత్రం..కోచ్ రవి శాస్ర్తీతో కలిసి కోల్‌కతా విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ