క్రీడాభూమి

పాండ్యపై ప్రశంసల జల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో భారత్ విజయానికి బాటలు వేసిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను మీడియా ప్రశంసల్లో ముంచెత్తింది. ఎంతో మంది అతనిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మ్యాచ్‌లో 83 పరుగులు చేసిన పాండ్య రెండు వికెట్లు కూడా కూల్చి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. వనే్డల్లో అతనికి ఇదే అత్యధిక స్కోరు. ఇంతకు ముందు, ఈ ఏడాది జూన్ 18న ది ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో అతను పాకిస్తాన్‌పై 76 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై ఒక మ్యాచ్‌లో 75 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసి, కనీసం రెండు వికెట్లు కూల్చిన మూడో భారత ఆల్‌రౌండర్‌గా అతను చరిత్ర సృష్టించాడు. మొదటి రెండు స్థానాల్లో సచిన్ తెండూల్కర్ (1998 అక్టోబర్ 28న ఢాకాలో 141 పరుగులు, 38 పరుగులకు 4 వికెట్లు), రాబిన్ సింగ్ (1999 జూన్ 4న ది ఓవల్ మైదానంలో 75 పరుగులు, 43 పరుగులకు రెండు వికెట్లు) పాండ్య కంటే ముందు ఈ ఫీట్ సాధించారు. కాగా, పాండ్య ఒక మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించి, కనీసం రెండు వికెట్లు కూల్చడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాలో ఇంగ్లాండ్‌పై అతను 56 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లోనూ రాణించి, 49 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. ఆడం జంపా బౌలింగ్‌లో అతను వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఈ విధంగా అతను ఒక ఇన్నింగ్స్‌లో మూడు వరుస సిక్సర్లు కొట్టడం ఇది మూడోసారి. ఇంత ముందు వనే్డల్లో ఒకసారి, టెస్టుల్లో ఒకసారి అతను ఈ విధంగా మూడు వరుస సిక్స్‌లతో అదరగొట్టాడు. ఈ ఏడాది పాండ్య 17 ఇన్నింగ్స్‌లో 32 సిక్సర్లు సాధించాడు. భారత్ తరఫున మరెవరూ ఇన్ని సిక్సర్లు కొట్టలేదు.

చిత్రం..హార్దిక్ పాండ్య