క్రీడాభూమి

ఝులన్ జీవిత విశేషాలతో ‘చక్‌దహా ఎక్స్‌ప్రెస్’ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 19: టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ తెండూల్కర్ జీవిత విశేషాలతో రూపుదిద్దుకున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక వికెట్లు సాధించిన మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన ఝులన్ గోస్వామి జీవిత విశేషాలతో మరో చిత్రం వెండితెరపై కనువిందు చేయనుంది. ‘చక్‌దహా ఎక్స్‌ప్రెస్’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని సొంత పట్టణమైన చక్‌దహా నుంచి ‘క్రికెట్ మక్కా’గా పేరు పొందిన లండన్‌లోని లార్డ్స్ మైదానం వరకు సాగిన ఝులన్ ప్రయాణ విశేషాలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. హిందీ భాషలో తెరకెక్కించబోతున్న ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ తర్వలో ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలవుతుందని దర్శకుడు సుశాంత దాస్ వెల్లడించాడు. ఝులన్ స్వస్థలమైన చక్‌దహా మొదలుకొని లార్డ్స్ మైదానం వరకు వివిధ లొకేషన్లలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుందని మంగళవారం ఆయన పిటిఐ వార్తా సంస్థకు తెలిపాడు. ఈ చిత్రంలో ఝులన్ పాత్ర కోసం ప్రస్తుతం బాలీవుడ్‌లోని కొంత మంది పెద్ద నటీమణులతో చర్చలు జరుపుతున్నామని, అయితే ఇంకా సంతకాలు జరుగనందున వారి పేర్లను వెల్లడించలేమని ఆయన చెప్పాడు. ‘ఇంతకుముందు మనం ధోనీ, సచిన్ తదితర మేటి క్రీడాకారుల జీవిత విశేషాలతో రూపొందిన చిత్రాలను చూశాం. కానీ మహిళా క్రికెటర్ జీవిత విశేషాలతో రూపుదిద్దుకుంటున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఝులన్ ఆడిన ప్రదేశాలకు మా సిబ్బందిని పంపుతాం. క్రికెట్‌లో ఝులన్ సాగించిన ప్రయాణంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తాం. 10 ఏళ్ల ప్రాయం నుంచి ఝులన్‌కు ఎదురైన కష్టాలు, వాటిని ఆమె అధిగమించిన తీరును ఈ చిత్రంలో వివరిస్తాం. దేశంలోని కోట్లాది మంది యువతకు ఈ చిత్రం స్ఫూర్తిదాయకంగా నిలిచి వారిని ఉత్తేజితం చేస్తుందని ఆశిస్తున్నాం’ అని సుశాంత దాస్ తెలిపారు.