క్రీడాభూమి

ఆస్ట్రేలియన్ హాకీ లీగ్‌కు 18 మందితో ఇండియా-ఏ కెప్టెన్‌గా ప్రీతి దూబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ హాకీ లీగ్-2017 టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు 18 మంది సభ్యులతో కూడిన ఇండియా-ఏ మహిళా జట్టును హాకీ ఇండియా (హెచ్‌ఐ) మంగళవారం నాడు ప్రకటించింది. ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో ఇండియా-ఏ జట్టుకు ఫార్వర్డ్ క్రీడాకారిణి ప్రీతి దూబే సారథ్యం వహించనుండగా, వైస్-కెప్టెన్సీ బాధ్యతలను ఉదిత నిర్వర్తించనుంది. దివ్య థెపే, బైచు దేవి ఖరిబమ్ గోల్‌కీపర్లుగా ఉన్న ఈ జట్టులో డిఫెన్స్ బాధ్యతలను నీలూ దాదియా, అస్మిత బర్లా, ప్రియాంక, సుమన్ దేవి, సలిమా టెటేలకు అప్పగించనుండగా, మిడ్‌ఫీల్డ్ స్థానాల కోసం ఉదిత, ఇషికా చౌదరి, మహిమా చౌదరి, గగన్‌దీప్ కౌర్, నీలాంజలి రాయ్, మరియానా కుజుర్ పోటీ పడనున్నారు. ఫార్వర్డ్ లైన్‌లో కెప్టెన్ దూబే, సంగీతా కుమారి, జ్యోతి, నవ్‌ప్రీత్ కౌర్, ముంతాజ్ ఖాన్ సేవలు అందించనున్నారు. ఆస్ట్రేలియన్ హాకీ లీగ్ (మహిళల) టోర్నమెంట్‌లో ఇండియా-ఏ జట్టు పాల్గొననుండటం ఇదే తొలిసారి. ఈ టోర్నీలో పాల్గొనే మొత్తం 10 జట్లను రెండు పూల్స్‌గా విభజించి ఒక్కో పూల్‌లో ఐదు జట్లకు చోటు కల్పిస్తారు. ఈ ఏడాది ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ క్వీన్స్‌లాండ్ జట్టుతో పాటు విక్టోరియా, నార్తరన్ టెరిటరీ, సౌత్ ఆస్ట్రేలియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్, టాస్మేనియా, ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ, న్యూజిలాండ్, ఇండియా-ఏ జట్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.