క్రీడాభూమి

స్మిత్‌కు పరీక్షా సమయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంఫర్ 19: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ పెద్ద సవాలును ఎదుర్కొంటున్నాడని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయ పడ్డాడు. విజయాలకోసం అతను కొత్త మార్గాలను వెతకాల్సిన సమయం వచ్చిందన్నాడు. 3బ్యాట్స్‌మన్‌గా స్మిత్ అద్భుతంగా రాణిస్తున్నాడనడంలో సందేహం లేదు. అయితే అతని కెప్టెన్సీ ఇప్పుడు సవాళ్లతో నిండి ఉంది. విజయాలకోసం అతను కొత్త మార్గాలను వెతకాల్సిన అవసరం ఉంది2 అని క్లార్క్ అన్నాడు. భారత్‌తో జరుగుతున్న అయిదు వన్‌డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలో జరిగిన తొలి వన్‌డే ఆస్ట్రేలియా 26 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. 3ఈ సిరీస్‌లో ఆసీస్ జట్టు తిరిగి పుంజుకోవాలంటే కోల్‌కతాలో జరిగే రెండో వన్‌డేలో విజయం సాధించడం ఎంతయినా ముఖ్యం. సిరీస్ గతిని నిర్ణయించే మ్యాచ్ ఇదేనని నేను అనుకొంటున్నాను2 అని క్లార్క్ అన్నాడు. భారత జట్టులో చైనామ్యాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను క్లార్క్ పొగడ్తలతో ముంచెత్తాడు. ధోనీ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడని క్లార్క్ అంటూ 3అయితే అతను 2019 ప్రపంచ కప్‌లో అడతాడా లేదా అని నన్నడగవద్దు. అతను 2023లో కూడా ఆడతాడు2 అని నవ్వుతూ అన్నాడు. కాగా, ఆసీస్ జట్టులో డేవిడ్ వార్నర్ తిరిగి ఫామ్‌లోకి వస్తాడన్న ఆశాభావాన్ని క్లార్క్ వ్యక్తం చేశాడు.