క్రీడాభూమి

భారత్‌కు గట్టిపోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ని కోల్పోయినప్పటికీ, మిగతా మ్యాచ్‌ల్లో భారత్‌కు గట్టిపోటీనిస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. అంతకు ముందు కురిసిన వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో, పిచ్ తీరును అతను పరిశీలించాడు. ఈడెన్ గార్డెన్స్ చీఫ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీతో కొద్దిసేపు ముచ్చటించాడు. గురువారం భారత్‌తో రెండో వనే్డ జరగనున్న నేపథ్యంలో అతను విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఒక మ్యాచ్‌ని చేజార్చుకున్నంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. వర్షం కురవడంతో, తమ ఇన్నింగ్స్‌ను 21 ఓవర్లకు కుదించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఒక రకంగా ఆ మ్యాచ్ తమకు టి-20 ఫార్మాట్‌గా మారిందని వ్యాఖ్యానించాడు. 50 ఓవర్లు ఆడే అవకాశం లభిస్తే, తమ ఆటగాళ్లంతా తగిన రీతిలో సిద్ధమయ్యేవారని అన్నాడు. తన కెప్టెన్సీపై మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చేసిన విమర్శలను అతను తోసిపుచ్చాడు. తాను కెప్టెన్‌గా సంక్లిష్టమైన దశలో ఉన్నానని క్లార్క్ అనడం విడ్డూరంగా ఉందన్నాడు. ఆటగాళ్లు ఎంత వరకూ పోరాడారనే అంశమే కీలకమని, ఒక మ్యాచ్ ఫలితాన్ని బట్టి ఏక మొత్తంగా విఫలమయ్యామంటూ ఆరోపించడం భావ్యం కాదని స్మిత్ అన్నాడు. విజయాలు సాధించేందుకు ఆటగాళ్లంతా శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నారని చెప్పాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యపై స్మిత్ ప్రశంసల జల్లు కురిపించాడు. పాండ్య చక్కటి ఇన్నింగ్స్ ఆడాడని అభినందించాడు. మ్యాచ్ ఫినిషర్‌గా ధోనీ మరోసారి తనను తాను నిరూపించుకున్నాడని అన్నాడు. నిజానికి తాను చూసినంత వరకూ ధోనీ ఆటలో ఎలాంటి మార్పు లేదని, అతను గతంలో మాదిరిగానే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడని పేర్కొన్నాడు. టాప్ పేసర్లు మైఖేల్ స్టార్క్, జొస్ హాజెల్‌వుడ్, జేమ్స్ పాటిన్సన్ గాయాల కారణంగా జట్టుకు దూరం కావడం దురదృష్టకరమని అన్నాడు. అయితే, మిచెల్ స్టార్క్, జొస్ హాజెల్‌వుడ్ వంటి మేటి పేసర్లు జట్టులో ఉన్నారని స్మిత్ తెలిపాడు. ఆరోన్ ఫించ్ ఫిట్నెస్‌పై అతను స్పష్టత ఇవ్వలేదు. అతను పూర్తి ఫిట్నెస్‌ను సంపాదిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. వర్షం కారణంగా ఇన్‌డోర్‌లోనే ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందని, గురువారం మ్యాచ్ జరిగే సమయానికి పిచ్ తీరు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని స్మిత్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని చెప్పాడు.