క్రీడాభూమి

స్మిత్ సెంచరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కెరీర్‌లో వందో వనే్డ ఇంటర్నేషనల్ ఆడనున్నాడు. లెగ్ బ్రేక్ బౌలర్‌గా జట్టులోకి అడుగుపెట్టిన స్మిత్ ఇప్పటి వరకూ 99 వనే్డలు ఆడాడు. 3,188 పరుగులు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 164 పరుగులు. ఎనిమిది సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు సాధించాడు. 271 ఫోర్లు, 30 సిక్సర్లు కొట్టాడు. 1,046 బంతలు వేసి, 931 పరుగులిచ్చిన అతను 27 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ కంటే బ్యాటింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టిన అతను 2015 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో సెంచరీతో కదం తొక్కాడు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించడంలో కీలక భూమిక పోషించాడు. సమర్థుడిగా పేరు సంపాదించిన అతను మైఖేల్ క్లార్క్ స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అలాన్ బోర్డర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్‌తో పోల్చలేకపోయినప్పటికీ, జట్టుకు కెప్టెన్‌గా శక్తి వంచన లేకుండా సేవలు అందిస్తున్నాడు. గురువారం భారత్‌తో జరిగే వనే్డ అతనికి కెరీర్‌లో వందో మ్యాచ్ కావడంతో, దానిని చిరస్మరణీయంగా మార్చుకునేందుకు కృషి చేస్తాడనడంలో ఎలాంటి అనుమానం లేదు.