క్రీడాభూమి

భారత స్టార్ల ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడ జరుగుతున్న జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్లు ముందంజ వేశారు. సుమారు వారం విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ మ్యాచ్‌ల్లో పాల్గొంటున్న సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ తమతమ మొదటి రౌండ్ మ్యాచ్‌లను సులభంగానే గెల్చుకున్నారు. ఇటీవలే కొరియా ఓపెన్ టైటిల్‌ను అందుకున్న తెలుగు తేజం పివి సింధు కూడా మొదటి రౌండ్‌లో విజయం సాధించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సైనా 21-17, 21-9 తేడాతో థాయిలాండ్‌కు చెందిన పొర్ట్‌పవీ చొచువాంగ్‌పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో సింధు 12-21, 21-15, 21-17 ఆధిక్యంతో జపాన్ క్రీడాకారిణి మినాత్సు మితానీపై విజయం సాధించింది. శ్రీకాంత్ 21-15, 12-21, 21-11 స్కోరుతో చైనా ఆటగాడు తియాన్ హౌవెయ్‌ను ఓడించాడు. హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా మొదటి రౌండ్‌ను విజయవంతంగా ముగించాడు. అతను డెన్మార్క్‌కు చెందిన ఆండెర్స్ ఆంటోనె్సన్‌పై 21-12, 21-14 తేడాతో గెలుపొందాడు. సమీర్ వర్మ 21-12, 21-19 స్కోరుతో ఖొసిత్ పెట్రాడబ్‌పై విజయం సాధించాడు. అయితే, అతని సోదరుడు సౌరభ్ వర్మ మొదటి రౌండ్‌లో పరాజయాన్ని చవిచూశాడు. అతనిపై ఏడో సీడ్ లిన్ డాన్ 11-21, 21-15, 21-13 తేడాతో గెలిచాడు. సాయి ప్రణీత్ పోరాటం కూడా మొదటి రౌండ్‌లోనే ముగిసింది. లీ డాంగ్ కుయెన్ చేతిలో అతను 23-21, 17-21, 14-21 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు.