క్రీడాభూమి

మెస్సీ విజృంభణ ఇబార్‌పై బార్సిలోనా ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జెంటీనా సాకర్ స్టూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ నాలుగు గోల్స్‌తో విజృంభించడంతో, స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ లా లిగాలో బార్సిలోనా 6-1 తేడాతో ఇబార్‌ను చిత్తుచేసింది. ఈ విజయం తర్వాత బార్సిలోనా తన సమీప ప్రత్యర్థి రియల్ మాడ్రిడ్ కంటే ఏడు పాయింట్లు ఆధిక్యంతో, నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. మ్యాచ్ 20వ నిమిషంలో మెస్సీ తొలి గోల్ చేసి, బార్సిలోనా ఖాతా తెరిచాడు. పాలిన్హో 38వ నిమిషంలో చేసిన గోల్‌తో ఆ జట్టు ఆధిక్యం 2-0కు చేరింది. 53వ నిమిషంలో డెనిస్ సొరేజ్ గోల్ సాధించగా, మరో ఆరు నిమిషాల్లోనే మెస్సీ తన రెండో గోల్ నమోదు చేశాడు. 62, 87 నిమిషాల్లో అతను మరో రెండు గోల్స్ చేసి, బార్సిలోనాకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఇబార్‌కు సెర్గీ ఎన్‌రిచ్ ఒక కంటి తుడుపు గోల్‌ను సాధించిపెట్టాడు.