క్రీడాభూమి

ఔట్.. నాటౌట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 21: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఔట్‌పై కొంత సేపు హైడ్రామా నడిచింది. చివరికి అంపైర్ అతనిని నాటౌట్ ప్రకటించడంతో, గందరగోళానికి తెరపడింది. విషయానికి వస్తే, కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో గుడ్‌లెన్త్‌లో వచ్చిన బంతిని ఆడడంలో పాండ్య విఫలమయ్యాడు. బ్యాట్‌ను ముద్దాడుతూ బంతి నేరుగా పాయింట్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ చేతుల్లో పడింది. దీనితో తాను ఔటయ్యాననే ఉద్దేశంతో పాండ్య పెవిలియన్ దారి పట్టాడు. అయితే, అంతకు ముందే దానిని డెడ్‌బాల్‌గా అంపైర్ ప్రకటించడాన్ని అతను గమనించలేదు. ఇలావుంటే, ఎవరినీ గమనించకుండా పాండ్య వెళ్లిపోవడాన్ని చూసిన స్మిత్ వెంటనే బంతిని బౌలర్ రిచర్డ్‌సన్‌కు విసిరాడు. దానిని అందుకున్న అతను బెయిల్స్‌ను తీసేయడంతో, పాండ్య రనౌటయ్యాడంటూ ఆస్ట్రేలియా క్రికెటర్లు అప్పీల్ చేశారు. అప్పటికే వర్షం ప్రారంభం కావడం ఈ డ్రామాను మరింత రక్తికట్టించింది. సాధారణంగా నోబాల్‌లో రనౌటైతే, దానిని ఔట్‌గానే పరిగణిస్తారు. కానీ, డెడ్‌బాల్ కావడంతో, పాండ్య ఔట్ కాదని అంపైర్ అభిప్రాయపడ్డాడు. వర్షం తగ్గిన తర్వాత ఆట మళ్లీ మొదలుకాగా, పాండ్య బ్యాటింగ్‌కు దిగడంతో, ప్రేక్షకుల్లో నెలకొన్న అనుమానాలకు తెరపడింది.