క్రీడాభూమి

ధోనీకే డిమాండ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్‌ను ఒక గొప్ప ఆటగాడిగా, కెప్టెన్‌గా శాసిస్తున్నది విరాట్ కోహ్లీ అన్నది అందరికీ తెలిసిన సత్యం. అయితే, దేశంలోని చాలా నగరాల్లో ఇప్పటికీ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటేనే విపరీతమైన క్రేజ్ ఉంది. అతనికి ఉన్న డిమాండ్ అంతా ఇంతాకాదు. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్స్‌లో స్టాండ్స్ అన్నీ కిక్కిరిసిపోవడానికి ధోనీ రాకనే ప్రధాన కారణం. కేదార్ జాదవ్ అవుటైన వెంటనే ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నప్పుడు స్టేడియం మొత్తం అతని పేరు మారుమోగింది. కోహ్లీ కంటే ధోనీనే కోల్‌కతా వాసులు అభిమానించడానికి కారణం లేకపోలేదు. అతను ఉద్యోగం చేసింది, క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయికి చేరింది కోల్‌కతాలో మ్యాచ్‌లు ఆడడం ద్వారానే. పైగా, ‘కోల్‌కతా ప్రిన్స్’ సౌరవ్ గంగూలీ కెరీర్‌లో చివరి టెస్టు ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆడినప్పుడు ఫీల్డింగ్‌ను చక్కదిద్దే బాధ్యతను ధోనీ అతనికి అప్పచెప్పాడు. ‘మిస్టర్ కూల్’ ధోనీ ప్రదర్శించిన నాటి క్రీడాస్ఫూర్తి కోల్‌కతా వాసులను అతనికి అభిమానులుగా మార్చేసింది. అందుకే, ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టు సమయంలో కోహ్లీ వంటి స్టార్ల కంటే ఎక్కువగా ధోనీకే బ్రహ్మరథం పట్టారు.