క్రీడాభూమి

మిల్లర్ హాఫ్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్బన్: డేవిడ్ మిల్లర్ అజేయ అర్ధ శతకంతో రాణించడంతో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టి-20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో గెలుపొంది శుభారంభం చేసింది. మిల్లర్ 35 బంతుల్లోనే 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫఫ్ డు ప్లెసిస్ (40) కూడా బాధ్యతాయుతమైన ఆటతో సౌతాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (40), మిచెల్ మార్ష్ (35) మెరుగ్గా ఆడారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 21 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. కాసిగో రబద, వీస్ చెరి రెండు వికెట్లు కూల్చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 19.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్ నైపుణ్యం దక్షిణాఫ్రికాకు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ కౌల్టర్ నైల్ 29 పరుగులకు మూడు వికెట్లు సాధించాడు.