క్రీడాభూమి

భారత్ అండర్-17 జట్టుకు హోం గ్రౌండ్‌గా ఢిల్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 22: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ ఆధ్వర్యంలో జరిగే అండర్-17 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టుకు ఐ-లీగ్‌లో చోటు కల్పించడమేగాక, ఢిల్లీని హోం గ్రౌండ్ చేసే అవకాశాలున్నాయి. వచ్చేనెల మొదటి వారంలో జరిగే సమావేశంలో ఈ విషయంపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఈ ఏడాది అండర్-17 వరల్డ్ కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. 2019లో అండర్-20 వరల్డ్ కప్ పోటీలను నిర్వహించే అవకాశం కోసం ఇప్పటికే భారత్ బిడ్‌ను కూడా వేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, అండర్-20 వరల్డ్ కప్ పోటీలకు అండర్-17 జట్టులోని సభ్యులనే తీర్చిదిద్దాలని ఎఐఎఫ్‌ఎఫ్ ఆలోచనగా కనిపిస్తున్నది. అందుకే, అండర్-17 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కూడా జట్టులోని సభ్యులను ఢిల్లీలోనే ఉంచి, అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇప్పించాలని ఎఐఎఫ్‌ఎఫ్ అనుకుంటున్నది. అందుకే, ఐ లీగ్‌లో కొత్త జట్టుగా చోటు కల్పించాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే, వచ్చేనెల సమావేశంలో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామని ఎఐఎఫ్‌ఎఫ్ ఆధ్వర్యంలోని టెక్నికల్ కమిటీకి చీఫ్‌గా వ్యవహరిస్తున్న శ్యామ్ థాపా తెలిపాడు. గురువారం అతను పిటిఐతో మాట్లాడుతూ వచ్చే సీజన్ నుంచి ఐ లీగ్‌లో భారత అండర్-17 జట్టు కూడా ఆడుతుందని చెప్పాడు. వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో రాణించడమే లక్ష్యంగా భారత జట్టు సిద్ధమవుతున్నదని చెప్పాడు.