క్రీడాభూమి

హోల్కర్ స్టేడియంలో కంగారూల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, సెప్టెంబర్ 23: ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యాన్ని సంపాదించిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆదివారం ఇక్కడి హోల్కర్ స్టేడియంలోనూ ఆస్ట్రేలియాను ఓడించి, సిరీస్‌ను 3-0 కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. చెన్నై, కోల్‌కతా నగరాల్లో జరిగిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించిన భారత్ ఇండోర్‌లోనూ కంగారూల వేటను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తున్నది. స్వింగ్ మాస్టర్లుగా ఎదిగిన భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా ఆసీస్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీస్తుండగా, స్పిన్నర్లు యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఏ దశలోనూ బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. చాహల్ చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తుంటే, భారత్ తరఫున హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కిన కుల్దీప్ తన 3చైనామన్2 బంతులతో ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీస్తున్నాడు. రెండో వనే్డలో 252 పరుగుల అత్యంత సాధారణమైన స్కోరును చేసినప్పటికీ, దానిని సమర్థంగా రక్షించుకోగలగడం భారత బౌలింగ్ ప్రతిభకు నిదర్శనం. అయితే, అత్యంత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ, కొంత మంది ఆటగాళ్ల నిలకడలేని ప్రదర్శన జట్టును వేధిస్తున్నది. రోహిత్ శర్మ, కేదార్ జాధవ్, మనీష్ పాండే చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోతున్నారు. దీనితో, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగేది ఎవరనే విషయంలో తలెత్తిన ప్రశ్నకు ఇంకా సమాధానం లభించడం లేదు. దక్షిణఫ్రికాలో పర్యటించిన భారత్ 3ఎ2 జట్టు తరఫున పరుగుల వరద పారించిన కేదార్ జాధవ్ ఈ స్థానాన్ని దక్కించుకోవాలన్నా, సిరీస్‌లో మిగతా రెండు వనే్డల్లోనూ కొనసాగాలన్నా ఆదివారం నాటి పోరులో సత్తా చాటాలి. 2019 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని, జాతీయ సెలక్టర్లు ఇప్పటి నుంచే అనేకానేక ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతో మంది యువ ఆటగాళ్లు అందుబాటులో ఉండంతో, ఫలానా స్థానం ఫలానా వారికి ప్రత్యేకం అనడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. ఎవరికి వారు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
దేశంలోని చిన్న మైదానాల్లో హోల్కర్ స్టేడియం కూడా ఒకటి. 70 అడుగుల్లోనే బౌండరీ ఉండడంతో, పరుగుల వరద పారుతుంది. గతంలో పలు మ్యాచ్‌లు ఈ విషయాన్ని రుజువు చేశాయి. గత ఏడాది న్యూజిలాండ్‌తో మూడో టెస్టు ఇదే మైదానంలో జరిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (211) డబుల్ సెంచరీతో రాణించగా, అజింక్య రహానే (188) కూడా అదే స్థాయి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత బ్యాట్స్‌మెన్ నుంచి మరోసారి భారీ స్కోరును అభిమానులు ఆశిస్తున్నారు.
బౌలింగ్‌లో ఆసీస్ బెటర్!
బ్యాటింగ్‌తో పోలిస్తే, కంగారూల బౌలింగ్ మెరుగ్గా కనిపిస్తున్నది. జొస్ హాజెల్‌వుడ్, మిచెల్ స్టార్క్ వంటి స్టార్లు లేకపోయినప్పటికీ, నాథన్ కౌల్టర్ నైల్, గ్లేన్ మాక్స్‌వెల్ భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నారు. వీరిద్దరూ టీమిండియా పరుగుల వేగానికి అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ, సమర్థుడైన స్పిన్నర్ లేకపోవడం ఆస్ట్రేలియాకు శాపంగా మారింది. మొదటి మ్యాచ్‌లో ఆడిన జంపా భారత బ్యాట్స్‌మెన్‌పై, ప్రత్యేకించి హార్దిక్ పాండ్యపై ఎలాంటి ప్రభావం చూపలేకపోవడంతో, రెండో వనే్డలో అతనిని తప్పించి, అష్టన్ అగర్‌ను మైదానంలోకి దించారు. కానీ, అతను కూడా ఆశించిన రీతిలో రాణించలేదు. ఒకవైపు భారత స్పిన్నర్లు రెచ్చిపోతుంటే, మరోవైపు తమ స్పిన్నర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. మొత్తం మీద, రెండు వరుస పరాజయాలతో ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు కనిపిస్తున్న ఆస్ట్రేలియా ఆదివారం నాటి మ్యాచ్‌లో మళ్లీ పుంజుకొని, భారత్‌ను ఎదురుదెబ్బ తీయడం అసాధ్యంగానే కనిపిస్తున్నది.

చిత్రం..ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కుల్దీప్ యాదవ్