క్రీడాభూమి

లంక క్రికెట్‌పై ఐసిసి విచారణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 24: శ్రీలంక క్రికెట్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) విచారణ చేపట్టింది. అయితే, ఫలానా సిరీస్ లేదా టోర్నమెంట్ సమయంలో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణకు ఆదేశించినట్టు ఐసిసి స్పష్టం చేయలేదు. వరల్డ్ కప్‌సహా పలు మ్యాచ్‌ల్లో శ్రీలంక క్రికెటర్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఇటీవల కాలంలో ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఐసిసి ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వంటి కొంత మంది క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్‌లపై బాహాటంగానే ఆరోపణలు చేశారు. 2015 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్ కూడా ఫిక్సింగ్‌కు గురైందని రణతుంగ ఆరోపణల్లో ఒకటి. క్రికెట్ ప్రపంచమంతా వ్యాపిస్తున్న అనుమానాలకు తెరదించడానికి ఐసిసి నడుం బిగించినట్టు కనిపిస్తున్నది. అందులో భాగంగానే, మొత్తం శ్రీలంక క్రికెట్‌పై స్థూలంగా విచారణ జరిపి, ఆతర్వాత అనుమానంగా ఉన్న టోర్నీలు లేదా మ్యాచ్‌లపై దృష్టి సారించే అవకాశాలున్నాయి.