క్రీడాభూమి

పిచ్‌ని తవ్వేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో మ్యాచ్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వమని యాంటీ టెర్రరిస్టు ఫ్రంట్ (ఎటిఎఫ్) హెచ్చరించింది. టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈనెల 19న చిరకాల ప్రత్యర్థులు పాకిస్తాన్, భారత్ తలపడనున్నాయి. అయితే, సరిహద్దులో ఉగ్రవాద కార్యకపాలను సాగిస్తూ, ఎంతో మంది సైనికుల మృతికి కారణమైన పాకిస్తాన్‌తో క్రీడా సంబంధాలను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ (హెచ్‌పి) ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ కూడా ఈ మ్యాచ్‌కి భద్రత కల్పించలేమంటూ చేతులెత్తేశాడు. అయితే, భద్రతపై ఎలాంటి అపోహలు అవసరం లేదని, అన్ని ఏర్పాట్లు చేశామని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రకటించింది. ఆటగాళ్ల భద్రత తమ బాధ్యత అని, మ్యాచ్‌ని ఆడాలా వద్దా అన్నది పాక్ అధికారుల ఇష్టమని వ్యాఖ్యానించింది. ఇలావుంటే, బిసిసిఐ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులు ఒక అవగాహనకు వచ్చి, మ్యాచ్ జరగాలని చూసినా, తాము వ్యతిరేకిస్తామని ఎటిఎఫ్ తేల్చిచెప్పింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి, హోం మంత్రిత్వ శాఖ అధికారులకు లేఖలు రాసినట్టు తెలిపింది. మొండిగా ముందుకు వెళితే, మ్యాచ్‌ని అడ్డుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతామని పేర్కొంది. పిచ్‌ని తవ్వేస్తామని హెచ్చరించింది. పాకిస్తాన్‌తో క్రీడా సంబంధాలను రద్దు చేసుకోవాలని కోరింది.