క్రీడాభూమి

మూడో వనే్డలోనూ భారత్ విజయభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, సెప్టెంబర్ 24: ఆస్ట్రేలియాతో ఆదివారం ఇక్కడి హోల్కర్ స్టేడియంలో జరిగిన మూడో వనే్డలోనూ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా విజయభేరి మోగించింది. 294 పరుగుల లక్ష్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఛేదించి, ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్‌ని గెల్చుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. వరుసగా మూడు విజయాలను నమోదు చేయడంతో, చివరి రెండు వనే్డలకు ప్రాధాన్యం లేకుండాపోయింది. హార్దిక్ పాండ్య, అజింక్య రహానే, రోహిత్ శర్మ అర్ధ శతకాలు భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించాయి. గాయం కారణంగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయన హార్డ్ హిట్టర్ ఆరోన్ ఫించ్ సెంచరీతో రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయంది. గౌరవ ప్రదమైన స్కోరును సా ధించామన్న ఆనందం ఆసీస్‌కు ఎక్కువ సేపు నిలవ లేదు. భారత్ బలమైన బ్యాటింగ్ లైనప్ ముందు 294 పరుగుల లక్ష్యం కూడా చిన్నదైపోయంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ చక్కటి ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకు ముందు జరిగిన రెండు వనే్డలతో పోలిస్తే, ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటింగ్ లైనప్ మెరుగుపడినట్టు కనిపించింది. కండరాలు బెణకడంతో మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయిన ఫించ్ ఈ మ్యాచ్‌లో అడుగుపెట్టడంతో జట్టు ఆత్మవిశ్వాసం పెరిగింది. మొదటి వికెట్‌కు 70 పరుగులు జత కలిసిన తర్వాత హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన వార్నర్ 44 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42 పరుగులు చేశాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కూడా క్రీజ్‌లో నిలదొక్కుకోవడంతో ఆసీస్ బలాన్ని సంతరించుకుంది. సూపర్ ఇన్నింగ్స్ ఆడిన ఫించ్ 125 బంతుల్లో, 12 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 124 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో కేదార్ జాధవ్ క్యాచ్ పట్టగా అవుట్ కావడంతో 224 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. తర్వాత కొద్దిసేపటికే స్మిత్ కూడా అవుట్ కావడంతో ఆ జట్టు దూకుడుకు కళ్లెం పడింది. స్మిత్ 63 పరుగులు చేసి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రాకు చిక్కాడు. 71 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో ఐదు ఫోర్లు ఉన్నాయి. భారత బౌలర్లు కొంత ఆలస్యంగా దాడికి ఉపక్రమించారు. దీనితో గ్లేన్ మాక్స్‌వెల్ (5), ట్రావిస్ హెడ్ (4), పీటర్ హాండ్స్‌కోమ్ (3) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. చివరిలో మార్కస్ స్టొయినిస్ (27 నాటౌట్), ఆష్టన్ అగర్ (9 నాటౌట్) వికెట్ల పతనాన్ని అడ్డుకొని, ఆస్ట్రేలియా స్కోరును 50 ఓవర్లలో 6 వికెట్లకు 293 పరుగులకు చేర్చారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. యుజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్య చెరొక వికెట్ సాధించారు.
శుభారంభం
ఆస్ట్రేలియాను ఓడించి, సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకోవడానికి బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానే శురంభాన్నిచ్చారు. ఇద్దరూ ఆసీస్ బౌలింగ్‌ను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా పరుగులు రాబట్టడంతో, టీమిండియా స్కోరు బోర్డు వేగంగా ముందుకు సాగింది. పోటాపోటీగా ఆడిన ఇద్దరూ అర్ధ శతకాలను నమోదు చేయడం విశేషం. జట్టు స్కోరు 139 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్‌ను రోహిత్ శర్మ రూపంలో కోల్పోయింది. అతను 62 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 71 పరుగులు సాధించి, నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు హామిల్టన్ కార్ట్‌రైట్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. 147 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది. 76 బంతులు ఎదుర్కొన్న రహానే తొమ్మిది ఫోర్లతో 70 పరుగులు సాధించి, పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 28, కేదార్ జాధవ్ 2 పరుగులకే పెవిలియన్ చేరారు. అయితే, క్రీజ్‌లో నిలబడిన హార్దిక్ పాండ్య ఏ దశలోనూ రన్‌రేట్‌లో వెనుకబడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అతను 72 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 78 పరుగులు చేసి, పాట్ కమిన్స్ బౌలింగ్‌లో కేన్ రిచర్డ్‌సన్‌కు చిక్కాడు. చివరిలో మనీష్ పాండే (36 నాటౌట్), మహేంద్ర సింగ్ ధోనీ (3 నాటౌట్) మరో వికెట్ కూలకుండా, మరో 13 బంతులు మిగిలి ఉండగానే భారత్‌ను లక్ష్యానికి చేర్చారు. 47.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 294 పరుగులు సాధించిన భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసి, సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

చిత్రం..భారత టాప్ స్కోరర్ హార్దిక్ పాండ్య