క్రీడాభూమి

అవినీతి లేని టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అవినీతికి ఏ విధంగానూ తావులేని రీతిలో టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆధ్వర్యంలోని అవినీతి నిరోధక విభాగం (ఎసియు) చీఫ్ సర్ రూనీ ఫ్లానగన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల కాలంలో అన్ని ఐసిసి ఈవెంట్స్‌లోనూ రోజుకు 24 గంటలు పని చసే హాట్‌లైన్‌ను ఏర్పాటు చేస్తున్నామని, క్రికెటర్లుగానీ, ఇతరులుగానీ బుకీలకు సంబంధించిన సమాచారాన్ని దాని ద్వారా ఐసిసికి అందించవచ్చని ఆదివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. సాధ్యమైనంత వరకూ స్వచ్ఛమైన టోర్నీని అందించడానికి ఐసిసి కృషి చేస్తున్నదని ఫ్లానగన్ అన్నాడు. అయితే, మనిషి వ్యక్తిత్వాలు, మనస్తత్వాలపై ఆధారపడి ఉన్నందున అవినీతిని సంపూర్ణంగా ప్రక్షాళన చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశాడు. టి-20 వరల్డ్ కప్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 58 మ్యాచ్‌లు జరుగుతాయని, టోర్నీ ముగిసిన తర్వాత ఆ మ్యాచ్‌లకు సంబంధించిన అంశాలు తీపి గురుతులుగా ఉండిపోవాలనే కోరుకుంటున్నామని అన్నాడు. అంతేగాక, టోర్నీ పూర్తయిన అనంతరం అవినీతి, ముడుపులు తీసుకోవడం, ఫిక్సింగ్, బెట్టింగ్ వంటి అంశాలు తెరపైకి వచ్చి, ఐసిసి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదని చెప్పాడు. క్రికెట్ ప్రతిష్ఠను దెబ్బతీసే వారు ఎవరైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నాడు. ఈ టోర్నీ కోసం సిద్ధంగా ఉంచిన హాట్‌లైన్ గురించి అతను వివరణనిస్తూ, రెండురకాలైన లైన్లు అందుబాటులో ఉంటాయని వివరించాడు. మొదటిటి టి-20 వరల్డ్ కప్ టోర్నమెంట్ నిర్వాహకులకు సమాచారం ఇవ్వడానికి ఉపయోగపడుతుందని, రెండోది దుబాయ్‌లోని ఐసిసి కార్యాలయంతో అనుసంధానం చేస్తామని ఫ్లానగన్ తెలిపాడు. టోర్నీ జరుగుతున్నప్పుడేగాక, పూర్తయిన తర్వాత కూడా ఎవరైనా తమకు సమాచారం అందించవచ్చని పేర్కొన్నాడు. మనుషుల తత్వాలను పూర్తిగా మార్చివేసే అద్భుత మంత్రదండాలు ఎవరి దగ్గరా ఉండవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. బెట్టింగ్ వంటి సమస్యలను సంపూర్ణంగా నివారించలేకపోతున్నామని వ్యాఖ్యానించాడు. అయితే, ఫిక్సింగ్, బెట్టింగ్ లేకుండా క్లీన్ టోర్నీని నిర్వహిస్తామన్న నమ్మకం తనకు ఉందన్నాడు. టి-20 వరల్డ్ కప్ విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ టోర్నీకి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని చెప్పాడు. గత ఏడాది వరల్డ్ కప్ టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల క్రికెట్ బోర్డులు ఆయా దేశాల పోలీస్ శాఖలతో ఒక ఒప్పందం కదుర్చుకున్నాయని వివరించాడు. క్రికెట్ మ్యాచ్‌లకు లేదా టోర్నీలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తికావాలంటే ఆతిథ్య దేశాల క్రికెట్ బోర్డులు ముందుగానే అక్కడి భద్రతా శాఖలతో ఒక అవగాహనకు రావాలని సూచించాడు. క్రికెట్ బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ చేసిన సిఫార్సును విలేఖరులు ప్రస్తావించగా అది ఐసిసి పరిధిలోకి రాదని ఫ్లానగన్ స్పష్టం చేశాడు. తనకు సంబంధించని అంశాలపై మాట్లాడబోనని అన్నాడు. ఒకవేళ భారత్‌లో బెట్టింగ్‌ను చట్టబద్ధం చేస్తే, ఆ బాధ్యతను స్వీకరించిన శాఖలు లేదా సంస్థలతో ఐసిసి సంప్రదింపులు జరుపుతుందన్నాడు.
అమీర్‌ను ఉదాహరణగా చూపుతాం
పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే పర్యవసానం ఎలా ఉంటుందో, తప్పు తెలుసుకొని మళ్లీ జీవన స్రవంతిలోకి వస్తే అందరి నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు లభిస్తాయో చెప్పడానికి అమీర్ ఉదంతాన్ని ఉదాహరణగా చూపుతామని ఫ్లానగన్ అన్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు అప్పటి పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ బట్, మహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ అమీర్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ఆరోపణలు రుజువుకావడంతో వీరు జైలు శిక్షను అనుభవించారు. సస్పెన్షన్ వేటుకు కూడా గురయ్యారు. సస్పెన్షన్ కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మహమ్మద్ అమీర్‌కు మళ్లీ పాకిస్తాన్ జాతీయ జట్టులో స్థానం లభించింది. ఆసిఫ్, సల్మాన్ బట్ ఇంకా పునరాగమన ప్రయత్నాల్లోనే ఉన్నారు. అమీర్ చేసిన పొరపాటును ముందుగానే తెలుసుకొని, విచారణ సమయంలో కోర్టుకు వివరాలు చెప్పాడని, తప్పు చేసినట్టు అంగీకరించాడని ఫ్లానగన్ తెలిపాడు. అందుకే, అతనికి పాక్ జట్టులో మళ్లీ స్థానం దక్కిందని అన్నాడు. పొరపాటు చేస్తే ఏమవుతుందనేది పాక్ క్రికెటర్ల అనుభవమే అందరికీ స్పష్టం చేస్తుందన్నాడు.