క్రీడాభూమి

ప్రాక్టీస్ సెషన్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: వర్షం కారణంగా అవుట్‌ఫీల్డ్ బురదమయం కావడంతో, శుక్రవారం ఉదయం నాటి టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దయింది. ఇన్‌డోర్స్‌లోనూ భారత జట్టు ప్రాక్టీస్ చేయలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరికొంత మంది ఆటగాళ్లు చాలాసేపు స్టాండ్స్‌లో నిలబడి, ఆటకు అనువైన పరిస్థితులు ఏర్పతాయేమోనని ఎదురుచూశారు. కానీ, అలాంటి అవకాశం లేకపోవడంతో ప్రాక్టీస్ రద్దయినట్టు జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఇలావుంటే, ముందు జాగ్రత్త చర్యగా అధికారులు మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఒకవేళ వర్షం వల్ల నీరు నిలిస్తే, వెంటనే పిచ్‌ని ఎండబెట్టడానికి సూపర్ సోకర్స్‌ను కూడా సిద్ధంగా ఉంచారు.