క్రీడాభూమి

మరో వేటకు కోహ్లీ సేన రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, అక్టోబర్ 6: ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను 4-1 తేడాతో గెల్చుకొని, ఆ ఫార్మాట్‌లో మళ్లీ ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన భారత్ టి-20 ఇంటర్నేషనల్స్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో, అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న భారత్‌ను ఆసీస్ వనే్డల్లో సమర్థంగా ఎదుర్కోలేకపోయిందనేది వాస్తవం. స్టీవెన్ స్మిత్ కెప్టెన్‌గా ఉన్న ఆ జట్టు అతి కష్టం మీద ఒక మ్యాచ్‌ని తన ఖాతాలో వేసుకొని, వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది. అయితే, టి-20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ కోసం ప్రయత్నించే భారత్ నుంచి తప్పుకోగలుగుతుందా అన్నది అనుమానంగానే ఉంది. శనివారం ఇక్కడి జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం (జెఎస్‌సిఎ) ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మొదటి టి-20లో ఏ విధంగా ఆడుతుందనే అంశంపైనే ఈ సిరీస్‌లో స్మిత్ బృందం ఎదురుదాడి ఆధారపడి ఉంటుంది. భారత బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దికాలం వరకూ కొంత బలహీనంగా కనిపించిన బౌలింగ్ విభాగం కూడా ఇప్పుడు మెరుగుపడింది. అటు పేస్‌లో, ఇటు స్పిన్‌లో రోజురోజుకూ బలాన్ని పుంజుకుంటున్నది. యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ రూపంలో సమర్థులైన స్పిన్నర్లు కోహ్లీకి లభించారు. పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్య ఎదుగుదల టీమిండియాకు అదనపు బలాన్నిస్తున్నది. ఏ రకంగా చూసినా ఆస్ట్రేలియా కంటే పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్నది. గణాంకాలు కూడా భారత్ ఆధిక్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. 12 టి-20 ఇంటర్నేషనల్స్‌లో తొమ్మిదింటిని భారత్ గెల్చుకుంటే, కేవలం మూడు ఆసీస్ ఖాతాలో చేరాయి. చివరిసారి ఈ రెండు జట్లు గత ఏడాది జనవరిలో, ఆస్ట్రేలియాలో ఢీకొన్నాయి. మూడు మ్యాచ్‌ల ఆ సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లో అలాంటి ఫలితానే్న సాధిస్తుందని అభిమానులు ధీమాతో ఉన్నారు.
కొత్త రూపం
వనే్డ ఇంటర్నేషనల్స్‌తో పోలిస్తే, ఆస్ట్రేలియా టి-20 జట్టు కొంత భిన్నంగా కనిపిస్తున్నది. అంతర్జాతీయ కెరీర్‌ను ఇంకా ప్రారంభించని ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను తుది జట్టులోకి తీసుకుంటారో లేదో చూడాలి. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ టిమ్ పైన్, ఆల్‌రౌండర్లు మోజెస్ హెన్రిక్స్, డాన్ క్రిస్టియన్‌తో ఆసీస్ మెరుగ్గానే ఉంది. అయితే, భారత వాతావరణం, పిచ్‌ల తీరుకు వారు ఎంత వరకూ అలవాటు పడతారన్నదే ప్రశ్న. జట్టులోని పలువురు ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఆడిన అనుభవం ఉంది. స్మిత్ బృందానికి కలిసొచ్చే అంశాల్లో ఇది కూడా ఒకటి. స్థూలంగా చూస్తే మాత్రం ఆసీస్‌పై భారత్‌దే పైచేయి అన్నది స్పష్టమవుతున్నది.