క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఆగ్రహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలక్కా (మలేసియా): సిరియాతో జరిగిన కీలక క్వాలిఫయర్ మ్యాచ్ డ్రాగా ముగియడంతో వరల్డ్ కప్‌లో పాల్గొనే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌కి రిఫరీగా వ్యవహరించిన అలిరెజా ఫఘానీపై మండిపడుతున్నది. మ్యాచ్ ప్రథమార్ధంలోనే గోల్ చేసిన ఆస్ట్రేలియా ఆతర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరించి, డిఫెన్స్‌కు పరిమితమైంది. ద్వితీయార్ధంలోనూ అదే విధానాన్ని అనుసరించింది. అయితే, 89వ నిమిషంలో సిరియా చేసిన పెనాల్టీ అప్పీల్‌పై రిఫరీ సానుకూలంగా స్పందించాడు. అ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సిరీయా ఈక్వెలైజర్‌ను సాధించింది. ఈ మ్యాచ్‌ని గెల్చుకొని ఉంటే, 2018 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాన్ని ఆస్ట్రేలియా దాదాపుగా ఖాయం చేసుకునేది. కానీ, డ్రాగా ముగియడంతో తదుపరి మ్యాచ్‌లు ఆ జట్టుకు కీలకంగా మారాయి. అందుకే, రిఫరీపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’కు ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నది.