క్రీడాభూమి

పాఠాలు నేర్చుకుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: అండర్-17 ప్రపంచ కప్ మొదటి మ్యాచ్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్నప్పటికీ భారత జట్టు ఎన్నో పాఠాలు నేర్చుకుందని చీఫ్ కోచ్ లూయిస్ నార్టన్ డి మటోస్ వ్యాఖ్యానించాడు. ఈ మెగా టోర్నీ మొదటి రోజైన శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అమెరికాను ఢీకొన్న భారత్ 0-3 తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ ఫలితం తనను నిరాశకు గురి చేసిందని, అయితే, ప్రపంచ కప్‌లో పాల్గొనడం జట్టుకు ఇదే మొదటిసారి కాబట్టి సహజంగానే ఒత్తిడికి గురయ్యారని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. జట్టు మొత్తం సమష్టిగా పోరాడడం సానుకూలైన అంశమని 64 ఏళ్ల మాజీ పోర్చుగీస్ ఆటగాడు మటోస్ పేర్కొన్నాడు. సుమారు 40,000 మంది ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్‌ని ఆడడం భారత ఆటగాళ్లకు ఇదే ప్రథమమని, పైగా తొలి మ్యాచ్‌లోనే అమెరికా వంటి బలమైన జట్టును ఎదుర్కోవాల్సి రావడంతో తడబడ్డారని చెప్పాడు. పలుమార్లు గోల్స్ చేసే అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారయని అన్నాడు. డిఫెండర్ అన్వర్ అలీ కొట్టిన బంతి గోల్ పోస్టుకు తగిలి దూరంగా వెళ్లడాన్ని అతను ఈ సందర్భంగా గుర్తుచేశాడు. మొత్తం మీద భారత యువ ఆటగాళ్ల ఆట సంతృప్తికరంగానే ఉందన్నాడు.