క్రీడాభూమి

టి-20లో భారత్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, అక్టోబర్ 7: వర్షం కారణంగా అంతరాయం ఏర్పడి, చివరికి డక్‌వర్త్ లూయస్ విధానం ద్వారా లక్ష్యాన్ని సవరించాల్సి వచ్చిన తొలి టి-20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను భారత్ 9 వికెట్ల తేడాతో ఓడించింది. లక్ష్యాన్ని 6 ఓవర్లలో 48 పరుగులుగా నిర్థారించగా, మరో మూడు బంతులు మిగిలి ఉండగానే, ఒక వికెట్ కోల్పోయ, గమ్యాన్ని చేరింది. వనే్డ సిరీస్‌ను 4-1 తేడాతో గెల్చుకున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా టి-20 ఫార్మాట్‌లోనూ శుభారంభం చేసింది.
టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా, ఆస్ట్రే లియా 18.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయ 118 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ 30 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు ఒక సిక్సర్‌తో 42 పరుగులు చేసి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గ్లేన్ మాక్స్‌వెల్, టిమ్ పైన్ చెరి 17 పరుగులు చేశారు. వీరి పోరాటంతోనే ఆసీస్‌కు ఆ మాత్రం స్కోరు సాధ్యమైంది. జస్‌ప్రీత్ బుమ్రా 17 పరుగులకు రెండు, కుల్దీప్ యాదవ్ 16 పరుగులకు రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు.
ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లు పూర్తికాకుండానే ఆట నిలిచిపోగా, ఆతర్వాత భారత్ ఇన్నింగ్స్ కూడా సకాలంలో మొదలుకాలేదు. దీనితో డక్‌వర్త్ లూయస్ విధానంలో భారత్ లక్ష్యాన్ని ఆరు ఓవర్లలో 48 పరుగులుగా నిర్ణయంచారు. తొలి మ్యాచ్‌ని గెల్చుకొని, మూడు మ్యాచ్‌ల టి-20 సి రీస్‌లో ఆధిక్యాన్ని అందుకోవడానికి బరిలోకి దిగిన భారత్ 11 పరుగు ల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయంది. 11 పరుగులు చే సిన అతనిని నాథన్ కౌల్టర్ నైల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం కెప్టెన్ కోహ్లీ (14 బంతుల్లో 22 నాటౌట్), శిఖర్ ధావన్ (12 బంతుల్లో 15 నా టౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారు. ఇంకా మూడు బంతు లు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. ఈ రెండు జట్ల మ ధ్య రెండో టి-20 ఈనెల 10న గౌహతిలో, చివరిదైన మూడో మ్యాచ్ 13న హైదరాబాద్‌లో జరుగుతాయ.