క్రీడాభూమి

రబదాకు పది వికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లూంఫొంటైన్, అక్టోబర్ 8: ఫాస్ట్ బౌలర్ కాగిసో రబదా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో మరో ఐదు చొప్పున మొత్తం పది వికెట్లు పడగొట్టడంతో, శ్రీలంకతో జరిగిన రెండవ, చివరి టెస్టును దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 254 పరుగుల భారీ తేడాతో గెల్చుకుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌ను దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లకు 573 పరుగుల భారీ స్కోరువద్ద డిక్లేర్ చేసింది. డీన్ ఎల్గార్ (113), ఎయిడెన్ మర్‌క్రామ్ (143), హషీం ఆమ్లా (132), ఫఫ్ డు ప్లెసిస్ (135) శతకాలతో కదంతొక్కారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 42.5 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. లిటన్ దాస్ ఒంటరి పోరాటం జరిపి 70 పరుగులు చేశాడు. మిగతా వారు విఫలం కావడంతో బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. ప్రత్యర్థి ఆహ్వానం పేరకు ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ మరోసారి పేలవమైన ఆటతో అభిమానులను నిరాశకు గురి చేసింది. 42.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. మహమ్మదుల్లా 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఇమ్రుల్ కయాస్ 32 పరుగులు చేశాడు. వీరిని మినహాయిస్తే, జట్టు సభ్యులంతా మూకుమ్మడిగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో 33 పరుగులకు ఐదు వికెట్లు కూల్చిన రబదా రెండో ఇన్నింగ్సలో 30 పరుగులిచ్చి ఐదు వికెట్లు సాధించాడు. కాగా, శ్రీలంకతో దక్షిణాఫ్రికా ఒక టూర్ మ్యాచ్, మూడు వనే్డలు, మరో రెండు టి-20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్: 120 ఓవర్లలలో 4 వికెట్లకు 573 (డీన్ ఎల్గార్ 113, ఎయిడెన్ మర్‌క్రామ్ 143, హషీం ఆమ్లా 132, ఫఫ్ డు ప్లెసిస్ 135, సుభాశిష్ రే 3/118).
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 42.5 ఓవర్లలో 147 ఆలౌట్ (లిటన్ దాస్ 70, ఇమ్రుల్ కయాస్ 26, కాగిసో రబదా 5/33, దుసనే ఆలివర్ 3/40).
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ (్ఫలోఆన్): 42.4 ఓవర్లలో 172 ఆలౌట్ (మహమ్మదుల్లా 43, ఇమ్రుల్ కయాస్ 32, ముష్ఫికర్ రహీం 26, కాగిసో రబదా 5/30, అదిలె ఫెహ్లువాయో 3/36).