క్రీడాభూమి

పాక్ బృందం వచ్చేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల: ధర్మశాలలో ఈనెల 19న జరిగే మ్యాచ్ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన పాకిస్తాన్ భద్రతా బృందం సోమవారం వాఘా సరిహద్దు మీదుగా అమృత్‌సర్‌కు వచ్చి, అక్కడి నుంచి ధర్మశాల చేరుకుంది. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ లాహోర్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ సెక్యూరిటీ ఆఫిసర్ విశ్రాంతి కల్నల్ అజాం ఖాన్ ఈ బృందంలో ఉన్నారు. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే అత్యంత ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌ని నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కి భద్రతా ఏర్పాట్లు చేయలేమంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ చేతులెత్తేయగా, ఆ బాధ్యతను స్వీకరిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా, కేంద్ర హోం శాఖకు వీర్‌భద్ర సింగ్ లేఖ రాయడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఆందోళన వ్యక్తం చేసింది. ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టలేమని వ్యాఖ్యానించింది. భారత్‌లో పాకిస్తాన్ జట్టు ఆడే అన్ని కేంద్రాల్లో, ప్రత్యేకించి ధర్మశాలలో చేపట్టిన భద్రతా చర్చలను పరిశీలించేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని పంపింది. ఈ కమిటీ ఇచ్చే నివేదక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పిసిబి ప్రకటించింది.
పాక్ వైదొలగదు!
టి-20 వరల్డ్ కప్ నుంచిగానీ, ధర్మశాలలో భారత్‌తో జరిగే మ్యాచ్ నుంచిగానీ పాకిస్తాన్ జట్టు వైదొలగుతుందా? లేదా? అన్న ప్రశ్నకు లేదన్న అభిప్రాయమే వ్యక్తమవుతున్నది. చివరికి ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ కూడా ఇదే సమాధానమిచ్చాడు. టి-20 వరల్డ్ కప్‌కు పాక్ జట్టు గైర్హాజరయ్యే అవకాశాలు ఏమాత్రం లేవన్నాడు. ఒకవేళ పాక్ జట్టు మ్యాచ్‌లు ఆడకపోతే జరిమానా విధిస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ, ఊహాజనితమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. తన ఉద్దేశంతో ధర్మశాలలో మ్యాచ్ అథాతథంగా జరుగుతుందని, పాకిస్తాన్ జట్టు ఈ టోర్నీలో పాల్గొంటుందని రిచర్డ్‌సన్ అన్నాడు.

కెప్టెన్సీకి మలింగ గుడ్‌బై
కొలంబో, మార్చి 7: బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల చేతిలో పరాజయాలను ఎదుర్కొన్న శ్రీలంక జట్టుకు టి-20 వరల్డ్ కప్ ఆరంభానికి ముందే మరో ఎదురుదెబ్బ తగిలింది. తన అసమాన బౌలింగ్ ప్రతిభతో 2014లో ఈ టైటిల్‌ను లంకు సాధించిపెట్టిన విలక్షణ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న కారణంగా నాయకత్వం నుంచి వైదొలగుతానని మలింగ లేఖ రాశాడని, దీనితో అతని స్థానంలో టెస్టు, వనే్డ ఫార్మెట్స్‌లో జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఏంలో మాథ్యూస్‌కే టి-20 పగ్గాలు కూడా అప్పగిస్తున్నామని వివరించింది. కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నప్పటికీ, ఆటగాడిగా అతను జట్టుకు అందుబాటులోనే ఉంటాడని తెలిపింది. ఇలావుంటే, ఆసియా కప్‌లో ఎదురైన పరాభవాలపై శ్రీలంక క్రికెట్ అధికారులు ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. తనపై వేటు తప్పదని గ్రహించిన మలింగ ముందుగానే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడన్న వాదన వినిపిస్తున్నది.