క్రీడాభూమి

పెరీరా మెరుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, అక్టోబర్ 10: దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌ను శ్రీలంక కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఇంతకుముందు అబుదాబిలో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన శ్రీలంక జట్టు మంగళవారం దుబాయ్‌లో ముగిసిన రెండో టెస్టులో 68 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను మట్టికరిపించి 2-0 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ దిల్‌రువన్ పెరీరా ఐదు వికెట్లతో ప్రత్యర్థుల వెన్ను విరిచి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 317 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిన పాకిస్తాన్ జట్టు సోమవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 198 పరుగులు సాధించింది. ఆ స్కోరుతో బుధవారం చివరి రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ నైట్ వాచ్‌మన్లు అసద్ షఫిక్, కెప్టెన్ సర్‌ఫ్రాజ్ అహ్మద్ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 27 పరుగులు మాత్రమే జోడించగలిగారు. ఆ తర్వాత పెరీరా బౌలింగ్‌లో సర్‌ఫ్రాజ్ అహ్మద్ 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్రదీప్‌కు దొరికిపోవడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మొహమ్మద్ అమీర్ కేవలం 4 పరుగులకే పెరీరా బౌలింగ్‌లో నిష్క్రమించగా, యాసిర్ షా (5) రంగన హెరత్ బౌలింగ్‌లో వికెట్ల వెనుక డిక్వెల్లా చేతికి చిక్కాడు. ఆ తర్వాత ఒంటరి పోరాటంతో సెంచరీ నమోదు చేసుకున్న అసద్ షఫిక్ 112 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సురంగ లక్మల్ బౌలింగ్‌లో మెండిస్‌కు క్యాచ్ ఇవ్వగా, టెయిలెండర్ వహాబ్ రియాజ్ 1 పరుగు మాత్రమే సాధించి హెరత్ బౌలింగ్‌లో చండీమల్ చేతికి చిక్కాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌటైన పాకిస్తాన్ జట్టు 68 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శ్రీలంక బౌలర్లలో దిల్‌రువన్ పెరీరా చక్కగా రాణించి 5 వికెట్లు కైవసం చేసుకోగా, రంగన హెరత్ రెండు వికెట్లు, సురంగ లక్మల్, గమగే, ఫెర్నాండో ఒక్కో వికెట్ చొప్పున అందుకున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో తలపడనున్న పాకిస్తాన్, శ్రీలంక జట్లు, ఆ తర్వాత 26వ తేదీ నుంచి మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో ఆడనున్నాయి.

చిత్రం..దిల్‌రువన్ పెరీరా