క్రీడాభూమి

నేటి నుంచి ఆసియా కప్ హాకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 10: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టు ఆదిలోనే కఠినమైన పరీక్ష ఎదును ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఆసియా ఖండంలో నెంబర్ వన్ హోదాను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్న భారత జట్టు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బుధవారం జపాన్‌తో జరిగే పూల్-ఏ ఆరంభ మ్యాచ్ ద్వారా తన పోరాటాన్ని ప్రారంభించనుంది. భారత జట్టు కోచ్ పదవి నుంచి ఇటీవల రోలంట్ ఓల్ట్‌మన్స్‌కు ఉద్వాసన పలికి అతని స్థానంలో మారినేని కొత్త కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే. కోచ్‌గా మారినే బాధ్యతలు చేపట్టిన తర్వాత బుధవారం తొలి టెస్టు మ్యాచ్ ఆడబోతున్న భారత జట్టు ఈ టోర్నమెంట్ ద్వారా కొత్త శకంలోకి అడుగు పెట్టబోతోంది. అయితే గత నాలుగేళ్లుగా భారత జట్టుకు ఎనలేని సేవలను అందించడంతో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టీమిండియాను 12వ స్థానం నుంచి 6వ స్థానంలోకి తీసుకొచ్చిన ఓల్ట్‌మన్స్ స్థానాన్ని భర్తీ చేయడం 43 ఏళ్ల మారినేకి ‘కత్తిమీద సాము’ లాంటిదే. గత ఎడిషన్ ఆసియా కప్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు ఇప్పుడు మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలో తమ పోరాటాన్ని పర్‌ఫెక్ట్‌గా ప్రారంభించాలని ఎదురు చూస్తోంది. పూల్-ఏలో భారత్, జపాన్‌తో పాటు మన చిరకాల ప్రతర్థులైన పాకిస్తాన్, ఆతిథ్య బంగ్లాదేశ్ జట్లకు చోటు కల్పించగా, పూల్-బిలో డిఫెండింగ్ చాంపియన్ కొరియా, మలేషియా, చైనా, ఒమన్ జట్లు ఉన్నాయి. ఏ టోర్నమెంట్‌లోనైనా ఆరంభ మ్యాచ్‌కు ప్రతి జట్టూ ఎంతో ప్రాధాన్యతనిస్తాయి. అలాగే ఇప్పుడు భారత జట్టు కూడా ఈ నెల 13వ తేదీన బంగ్లాదేశ్‌తోనూ, ఆ తర్వాత 15వ తేదీన పాకిస్తాన్‌తో తలపడటానికి ముందు విజయంతో తన పోరాటాన్ని ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతోందని, ఈ టోర్నీలో మొదటి సవాలును ఎదుర్కొనేందుకు భారత జట్టు పూర్తి స్థాయిలో సిద్ధమైందని కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తెలిపాడు. ఆసియా ఖండంలో ఆధిపత్యాన్ని చాటుకునేందుకు మన్‌ప్రీత్‌తో పాటు భారత జట్టుకు ఈ టోర్నమెంట్ చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ టోర్నీలో తాము నెంబర్ వన్ జట్టుగా బరిలోకి దిగబోతున్నామన్న విషయం తెలుసని, ఆ హోదాను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పోరాడుతామని మన్‌ప్రీత్ స్పష్టం చేశాడు. ఇంతకుముందు ఈ ఏడాది ఆరంభంలో జపాన్‌తో సుల్తాన్ అజ్లన్ షా కప్ టోర్నీలో తలపడిన భారత జట్టు 4-3 గోల్స్ తేడాతో విజయం సాధించింది.