క్రీడాభూమి

పోరుకు సైనా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆడేందుకు భారత బాడ్మింటన్ స్టార్ సైనా సిద్ధమైంది. ఫిట్నెస్ సమస్యతో ఇటీవల కాలంలో పలు టోర్నీలకు దూరమైన సైనా క్వాలిఫయర్స్‌తో మంగళవారం నుంచి ఆరంభం కానున్న ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో పాల్గొననుంది. ప్రస్తుతం తనకు ఎలాంటి సమస్యలు లేవని సైనా తెలిపింది. గత ఏడాది ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందిన సైనా ఈసారి టైటిల్‌పై కనే్నసినట్టు చెప్పింది.

థర్డ్ డౌన్‌లో
బ్యాటింగ్ చేయాలి
ధోనీకి సెవాగ్ హితవు
న్యూఢిల్లీ, మార్చి 7: రానున్న టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మాజీ క్రికెటర్ వీరేందర్ సెవాగ్ సూచించాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన ఆసియా కప్ టి-20 చాంపియన్‌షిప్ ఫైనల్‌లో త్రీ డౌన్‌లో బ్యాటిగ్‌కు దిగిన ధోనీ అసాధారణ ప్రతిభ కనబరిచాడని ప్రశంసించాడు. అతనికి అదే సరైన స్థానమని మంగళవారం ఒక టీవీ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ మరో రెండుమూడేళ్లు క్రికెట్ ఆడే శక్తిసామర్థ్యాలు ధోనీకి ఉన్నాయని సెవాగ్ అభిప్రాయపడ్డాడు. తన అభిప్రాయం ప్రకారం 2019 వరల్డ్ కప్‌లోనూ ధోనీ ఆడతాడని చెప్పాడు. అతనికి ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవన్నాడు. జట్టులో వర్గాలుగానీ, రాజకీయాలుగానీ లేవని, జట్టు మొత్తం ఒకటిగా నిలిచి, దేశానికి ఉత్తమ సేవలను అందిస్తున్నదని చెప్పాడు.