క్రీడాభూమి

అంతర్జాతీయ కెరీర్‌కు రాబెన్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమ్‌స్టర్‌డామ్, అక్టోబర్ 11: నెదర్లాండ్స్ కెప్టెన్ అర్జెన్ రాబెన్ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. అతను రెండు గోల్స్ సాధించడంతో, వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ చివరి మ్యాచ్‌లో స్వీడన్‌ను 2-0 తేడాతో ఓడించినప్పటికీ, 2018 వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్ క్వాలిఫై కాలేదు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే, వేలాది మంది ప్రేక్షకులు నిలబడి హర్షధ్వానాలు చేస్తుండగా, అందరికీ అభివాదం చేస్తూ అతను మైదానం నుంచి వెళ్లిపోయాడు. నెదర్లాండ్స్ తరఫున 96 మ్యాచ్‌లు ఆడిన 33 ఏళ్ల రాబెన్ 37 గోల్స్ సాధించాడు. బయెర్న్ మ్యూనిచ్ క్లబ్‌లో కీలక ఆటగాడిగా ఉన్న అతను 2010లో నెదర్లాండ్స్ వరల్డ్ కప్ ఫైనల్స్ చేరడంలో కీలక భూమిక పోషించాడు. ఎక్‌స్ట్రా టైమ్‌లో అతను చేసిన గోల్‌తోనే స్పెయిన్‌ను 1-0 తేడాతో ఓడించిన నెదర్లాండ్స్ వరల్డ్ కప్‌కు అర్హత సంపాదించింది.
బెలారస్‌ను 2-1 తేడాతో ఓడించిన ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌పై 2-0 ఆధిక్యంతో గెలిచిన పోర్చుగల్ జట్లు వరల్డ్ కప్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించాయి.