క్రీడాభూమి

అండర్-17 సాకర్ వరల్డ్ కప్ ప్రీ క్వార్టర్స్‌కు ఫ్రాన్స్, ఇంగ్లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గువహటి, అక్టోబర్ 11: ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు అండర్-17 సాకర్ వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాయి. అమిన్ గుయిరీ రెండు గోల్స్ చేసి, జపాన్‌పై ఫ్రాన్స్‌కు 2-1 తేడాతో విజయాన్ని అందించాడు. 13వ నిమిషంలో తొలి గోల్ చేసిన అతను 71వ నిమిషంలో మరో గోల్ సాధించాడు. జపాన్ తరఫున తైసెయి మియాషిరో ఒక గోల్ చేశాడు. కాగా, కోల్‌కతాలో జరిగిన మరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 3-2 తేడాతో మెక్సికోను ఓడించి ప్రీ క్వార్టర్స్ చేరంది. రియాన్ బ్రూస్టర్ (39వ నిమిషం), ఫిలిపి ఫోడెన్ (48వ నిమిషం), జాడన్ సాంచో (55వ నిమిషం) గోల్స్ ఇంగ్లాండ్‌ను గెలిపించాయి. మెక్సికో ఆటగాడు బిగో లైనెజ్ రెండు గోల్స్ (65, 72 నిమిషాలు) సాధించినప్పటికీ, తన జట్టు ఓటమిని అడ్డుకోలేకపోయాడు.
గువహటిలో న్యూ కాలెడోనియాను ఎదుర్కొన్న హోండురాస్ 5-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మెజియా (25, 42 నిమిషాలు), పాట్రిక్ పలాసియస్ (51, 88 నిమిషాలు) చెరి రెండు గోల్స్ సాధించగా, జాషువా కనాలెస్ (27వ నిమిషం) ఓ గోల్ చేశాడు. కాగా, కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో చిలీని ఇరాక్ 3-0 తేడాతో చిత్తుచేసింది. మహమ్మద్ దావూద్ 6, 68 నిమిషాల్లో గోల్స్ నమోదు చేశాడు. 81వ నిమిషంలో చిలీ ఆటగాడు డియో వలెన్షియా ఓన్ గోల్ చేయడంతో, ఇరాక్ గోల్స్ సంఖ్య 3కు పెరిగింది.

మెక్సికోపై భారత్ గెలుపు
ఆసియా కప్ టోర్నీకి అర్హత

బెంగళూరు, అక్టోబర్ 11: ఎఎఫ్‌సి ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు భారత్ అర్హత సంపాదించింది. 1984 తర్వాత ఈ టోర్నీకి భారత్ క్వాలిఫై కావడం ఇదే మొదటిసారి. బుధవారం మెక్సికోతో జరిగిన మ్యాచ్‌ని 3-1 తేడాతో గెల్చుకోవడం ద్వారా, క్వాలిఫయర్స్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆసియా కప్‌లో అవకాశాన్ని భారత్ దక్కించుకుంది. మ్యాచ్ 28వ నిమిషంలో రోలింగ్ బోర్గెస్ తొలి గోల్ చేయగా, 60వ నిమిషంలో కెప్టెన్ సునీల్ ఛత్రీ గోల్ చేశాడు. మెక్సికో పొరపాటున ఓన్ గోల్ చేయగా, భారత్ ఖాతాలో మూడో గోల్ చేరింది. కాగా, మెక్సికో తరఫున నికోలస్ టరావో ఒక గోల్ చేశాడు.

ఆసియా కప్ హాకీ
భారత్ శుభారంభం
జపాన్‌పై 5-1 తేడాతో ఘన విజయం
ఢాకా, అక్టోబర్ 11: ఇక్కడ జరుగుతున్న ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. జపాన్‌ను 5-1 తేడాతో చిత్తుచేసింది. మ్యాచ్ మూడో నిమిషంలోనే ఎస్వీ సునీల్ ద్వారా తొలి గోల్‌ను తన ఖాతాలో వేసుకున్న భారత్ అదే దూకుడును కొనసాగించింది. 22వ నిమిషంలో లలిత్ ఉపాధ్యాయ్, 33వ నిమిషంలో రమణ్‌దీప్ సింగ్ సింగ్ గోల్స్ చేయగా, హర్మన్‌ప్రీత్ సింగ్ 35, 48 నిమిషాల్లో గోల్స్‌ను అందించాడు. జపాన్ తరపున నమోదైన ఏకైక గోల్‌ను కెన్జీ కిటాజొటో సాధించాడు.