క్రీడాభూమి

మెస్సీ మ్యాజిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్విటో (ఈక్వెడార్), అక్టోబర్ 11: సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్‌తో రాణించి, 2018 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్‌కు అర్జెంటీనా అర్హత పొందడంలో కీలక పాత్ర పోషించాడు. మెస్సీ మ్యాజిక్ పని చేయడంతో, ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌ని అర్జెంటీనా 3-1 తేడాతో గెల్చుకుంది. సొంత గడ్డపై, వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈక్వెడార్ మ్యాచ్ ఆరంభమైన మొదటి నిమిషంలోనే గోల్ సాధించింది. రొమారియో ఎల్బరా ఈ గోల్‌ను చేశాడు. అయితే, మొదట్లోనే వచ్చిన గోల్‌తో దక్కించుకున్న ఆధిక్యాన్ని ఈక్వెడార్ కొనసాగించలేకపోయింది. అర్జెంటీనా ఆటగాళ్ల విజృంభణ ముందు నిలవలేకపోయింది. మెస్సీ మైదానమంతా తానై కనిపించాడు. 11వ నిమిషంలో ఈక్వెలైజర్‌ను అందించిన అతను 18వ నిమిషంలో మరో గోల్ చేసి, అర్జెంటీనాను ఆధిక్యంలో నిలబెట్టాడు. ఆతర్వాత ప్రథమార్ధంలో మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధం మొదట్లో కూడా మెస్సీ బృందం డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇచ్చింది. మ్యాచ్ నిస్సారంగా సాగుతున్న సమయంలో, మెస్సీ హ్యాట్రిక్ పూర్తి చేశాడు. 62వ నిమిషంలో అతను మూడో గోల్ చేసి, ప్రేక్షకుల్లో ఆనందాన్ని నింపాడు. ఈక్వెడార్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ గోల్స్ సాధించడంలో సఫలం కాలేకపోయింది.
అమెరికా ఔట్: కొవా: అమెరికా 1986 తర్వాత మొదటిసారి సాకర్ వరల్డ్ కప్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించడంలో విఫలమైంది. ట్రినిడాడ్ అండ్ టొబాగోతో జరిగిన కీలక మ్యాచ్‌ని 1-2 తేడాతో చేజార్చుకొని, క్వాలిఫయర్స్ దశలోనే నిష్క్రమించింది. వచ్చే ఏడాది రష్యాలో జరిగే ప్రపంచ కప్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించడంలో అమెరికా విఫలం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసంది. 1930 మొట్టమొదటి వరల్డ్ కప్‌లో మూడో స్థానాన్ని ఆక్రమించిన అమెరికా 1954 నుంచి 1986 వరకూ ఈ మెగా టోర్నీకి క్వాలిఫై కాలేకపోయింది. అయితే, ఆతర్వాత మెరుగైన ఆటతో క్రమం తప్పకుండా క్వాలిఫై అవుతూ వచ్చింది. కానీ, ట్రినిడాడ్ చేతిలో ఓడడం వల్ల ఈసారి ఆ అవకాశాన్ని చేజార్చుకుంది. ఒమర్ గంజాలెజ్ ఓన్ గోల్ అమెరికా పరాజయానికి కారణమైంది. మ్యాచ్ 17వ నిమిషంలో అమెరికా ఆటగాడు గంజాలెజ్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి, మూల్యాన్ని చెల్లించుకున్నాడు. అతను కొట్టిన బంతి నేరుగా తమ గోల్ పోస్టులోకే దూసుకెళ్లడంతో అమెరికా కంగుతిన్నది. కాగా, అయాచితంగా లభించిన గోల్‌తో ఉత్సాహాన్ని పొందిన ట్రినిడాడ్‌కు 37వ నిమిషంలో అల్విన్ జోన్స్ గోల్‌ను అందించాడు. తీవ్రమైన ఒత్తిడికి లోనైన అమెరికా ఎదురుదాడికి దిగి, 47వ నిమిషంలో ఒక గోల్‌ను సంపాదించింది. క్రిస్టియన్ పలిసిక్ ఈ గోల్‌ను చేశాడు. అప్పటి వరకూ కొంత ఉదాసీనంగా ఉన్న ట్రినిడాడ్ రక్షణ వలయాన్ని పటిష్టం చేసుకొని, అమెరికా ఈక్వెలైజర్ నమోదు చేయకుండా అడ్డుకుంది. మ్యాచ్‌ని ఆ జట్టు గెల్చుకోవడంతో, అమెరికా క్వాలిఫయర్స్ దశ నుంచే వెనుదిరిగింది.ఇతర మ్యాచ్‌ల విషయానికి వస్తే, మెక్సికోను హోండురాస్ 3-2 తేడాతో ఓడించింది. మెక్సికో ఆటగాడు గులెర్మో ఒచావో ఓన్ గోల్ చేసి, తన జట్టు పరాజయానికి కారణమయ్యాడు. కోస్టారిపై పనామా 2-1, సిరియాపై ఆస్ట్రేలియా 2-1, చిలీపై బ్రెజిల్ 3-0, బొలీవియాపై ఉరుగ్వే 4-2, పరాగ్వేపై వెనుజులా 1-0, సైప్రస్‌పై బెల్జియం 4-0, ఫరో ఐలాండ్స్‌పై హంగరీ 1-0, అండోరాపై లాత్వియా 4-0, జీబ్రాల్టర్‌పై గ్రీస్ 4-0 గోల్స్ తేడాతో విజయాలను నమోదు చేశాయి. మెరూ/ కొలంబియా, లక్సెంబర్గ్/ బల్గేరియా మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.