క్రీడాభూమి

నా లక్ష్యం టెస్టు క్రికెట్ ఆస్ట్రేలియా పేసర్ బెరెన్‌డార్ఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గువాహటి, అక్టోబర్ 11: టెస్టు క్రికెట్‌లో ఆడడమే తన లక్ష్యమని ఆస్ట్రేలియా సంచలన పేసర్ జాసన్ బెరెన్‌డార్ఫ్ స్పష్టం చేశాడు. మంగళవారం భారత్‌తో జరిగిన రెండో టి-20లో కేవలం 21 పరుగులిచ్చి, రోహిత్ శర్మ, మనీష్ పాండే, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ వికెట్లు పడగొట్టిన అతను ఆసీస్ విజయానికి బాటలు వేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. యాషెస్ సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు పాట్ కమిన్స్ స్వదేశానికి వెళ్లడంతో, అతని స్థానంలో జట్టులోకి వచ్చిన బెరెన్‌డార్ఫ్ రాంచీలో జరిగిన మొదటి టి-20లో కేవలం ఒక ఓవర్ వేశాడు. రెండో మ్యాచ్‌లో అతనికి నాలుగు ఓవర్లు వేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. దానిని సద్వినియోగం చేసుకుంటూ, నాలుగు కీలక వికెట్లు పడగొట్టి, ఒక్కసారిగా స్టార్ ఇమేజ్‌ను సంపాదించాడు. తన బౌలింగ్ విశే్లషణను తానే నమ్మకలేకపోతున్నానని అతను ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. సరైన దిశలో బంతులు వేశానని అన్నాడు. బంతి స్వింగ్ కావడం తనకు కలిసొచ్చిందని చెప్పాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, టెస్టు క్రికెట్ ఆడాలన్నదే తన లక్ష్యమని అన్నాడు. క్రికెట్‌కు సరైన అర్థం టెస్టుల్లోనే ఉంటుందని, ఆస్ట్రేలియా బ్యాగీగ్రీన్ టోపీని ధరించి, మైదానంలోకి దిగాలన్న కోరిక చాలాకాలంగా ఉందని తెలిపాడు. ఈ లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తున్నానని చెప్పాడు. రాబోయే యాషెస్ సిరీస్‌లో మిచెల్ స్టార్క్‌తోపాటు కొత్త బంతిని పంచుకునే అవకాశం ఈ ఎడమచేతి వాటం పేసర్‌కు లభిస్తుందో లేదో చూడాలి.