క్రీడాభూమి

ఆసీస్ క్రికెటర్ల బస్సుపై రాయితో దాడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గువాహటి, అక్టోబర్ 11: ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తుతెలియని ఆగంతకుడు రాయితో దాడి చేశాడు. ఈ సంఘటనలో బస్సు అద్దం ఒకటి ధ్వంసమైంది. అయితే, సమీపంలోని సీటు ఖాళీగా ఉండడంతో ఎవరూ గాయపడలేదు. మంగళవారం భారత్‌తో జరిగిన రెండో టి-20 ఇంటర్నేషనల్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించిన ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1గా సమం చేసింది. 13న హైదరాబాద్‌లో జరిగే చివరి, మూడో మ్యాచ్‌ని ఉత్కంఠ భరితంగా మార్చింది. రెండో టి-20 ముగిసిన తర్వాత ఆసీస్ క్రికెటర్లు బర్సాపరా ప్రాంతం నుంచి ప్రత్యేక బస్సులో రాడిసన్ హోటల్‌కు బయలుదేరారు. స్టేడియానికి సమీపంలోనే గుర్తుతెలియని వ్యక్తి విరిసిన రాయి బస్సు అద్దానికి తగిలింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

ఆకతాయి పనేనా?

ఆసీస్ క్రికెటర్ల బస్సుపై రాయి విసిరిన సంఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో ఆకతాయి చేసిన పనిగా చాలా మంది దీనిని అభివర్ణిస్తున్నారు. టీమిండియా ఏకంగా ఎనిమిది వికెట్ల తేడతో ఓడడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఎవరూ ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే, కొంత మంది మాత్రం దీనిని ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిగానే అనుమానిస్తున్నారు. గువాహటి ఒక క్రీడా హబ్‌గా ఎదుగుతున్న దశలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని అస్సాం క్రికెట్ సంఘం (ఎసిఎ) ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. గువాహటికి ఉన్న మంచి పేరును దెబ్బతీసేందుకు కుట్ర జరిగి ఉండవచ్చని అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ ట్వీట్ చేశారు. కారకులు ఎవరైనప్పటికీ, జరిగిన సంఘటనకు తాను క్షమాపణ చెప్తున్నానని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.

భద్రతకు
అధిక ప్రాధాన్యం

న్యూఢిల్లీ: భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని కేంద్ర క్రీడాశాఖ మంత్రి, మాజీ ఒలింపియన్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ స్పష్టం చేశారు. గౌహతిలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై రాయి దాడి సంఘటనపై ఆయన స్పందిస్తూ, ఆసీస్ టూర్‌కుగానీ, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఫిఫా అండర్-17 సాకర్ వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌కుగానీ ఈ సంఘటన వల్ల ఎలాంటి విఘాతం ఉండదని అన్నారు. క్రీడాకారులకు, అధికారులకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. గువాహటి సంఘటనపై అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌తో ఇప్పటికే చర్చించానన్నారు.