క్రీడాభూమి

ధర్మశాలలోనే మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య టి-20 వరల్డ్ కప్ మ్యాచ్ ధర్మశాలలోనే జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ స్పష్టం చేశాడు. ధర్మశాల లేదా న్యూఢిల్లీలో జరగాల్సిన మ్యాచ్‌లను మరో కేంద్రానికి మార్చే ఆలోచన ఐసిసికి లేదని తేల్చిచెప్పాడు. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని అన్నాడు. ధర్మశాలలో మ్యాచ్‌కి భద్రతా ఏర్పాట్లు చేయలేమని పేర్కొంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఢిల్లీలో మ్యాచ్‌కి రవాణాపరమైన సమస్యలు తలెత్తుతాయన్న వాదన వినిపిస్తున్నది. ఈ రెండు మ్యాచ్‌లను వేరే కేంద్రాలకు మార్చాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. అయితే, మార్పు ప్రసక్తే లేదని రిచర్డ్‌సన్ అన్నాడు. సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. ధర్మశాలలో భద్రత కల్పించలేమని వీర్‌భద్ర సింగ్ స్పష్టం చేయడాన్ని ప్రస్తావించగా, పాక్ క్రికెటర్లకు భద్రత కల్పించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం సీకరించిందని రిచర్డ్‌సన్ అన్నాడు. వాస్తవానికి ఇది భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) లేదా ఐసిసికి సంబంధించిన అంశం కాదని వ్యాఖ్యానించాడు.
అన్ని ఫార్మెట్స్‌కూ ప్రాధాన్యం
క్రికెట్‌లోని అన్ని ఫార్మెట్స్‌కూ సమ ప్రాధాన్యతనిస్తామని రిచర్డ్‌సన్ అన్నాడు. టెస్టు, వనే్డ, టి-20 ఫార్మెట్స్ చెట్టపట్టాలేసుకొని సాగాలని ఐసిసి కోరుకుంటున్నదని చెప్పాడు. ఒక ఫార్మెట్‌కు పెద్దపీట వేయడంగానీ, మరో పార్మెట్‌ను నిర్లక్ష్యం చేయండగానీ జరగవని అన్నాడు.